‘కోడెలను చంద్రబాబు వాడుకొని వదిలేశారు’

తాజాగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ కోడెల మృతిపై పలు వ్యాఖ్యలు చేశారు. కోడెల శివప్రసాదరావును ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పెట్టారన్నారు.

news18-telugu
Updated: September 18, 2019, 1:53 PM IST
‘కోడెలను చంద్రబాబు వాడుకొని వదిలేశారు’
చంద్రబాబు, కోడెల
news18-telugu
Updated: September 18, 2019, 1:53 PM IST
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్యతో ఏపీలో రాజకీయాలు మరింత వాడివేడిగా మారాయి. సోమవారం రోజు కోడెల తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఘటనపై అధికార, ప్రతిపక్షాలు కోడెల మృతికి బాధ్యులు మీరంటే... మీరంటూ విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా కోడెల మృతిపై వైసీపీ ముఖ్య నేత, పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి  సంచలన వ్యాఖ్యలు చేశారు.

కోడెల మరణాన్ని చంద్రబాబు నాయుడు రాజకీయం చేసి ఆయనకు ఆత్మశాంతి లేకుండా వేధిస్తున్నారన్నారు. ఆయన కొనుగోలు చేసిన 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను అనర్హులు చేయకుండా కొడెలను వాడుకొని చంద్రబాబు వదిలేశారని విమర్శలు గుప్పించారు. నమ్మిన వారు ఆపదలో తనకు అండగా నిలవలేదన్న నిస్పృహతోనే కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు విజయసాయిరెడ్డి. ఈ మేరకు ట్విట్టర్‌లో విజయసాయిరెడ్డి ఓ పోస్టు చేశారు. చంద్రబాబు టీడీపీని ఓ సర్కాస్ ట్రూపులా మార్చేశారంటూ ఎద్దేవా చేశారు. ఒక చోట టెంట్ వేసి జనం పోగవగానే షో మొదలు పెడతారన్నారు.

తాజాగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ కోడెల మృతిపై పలు వ్యాఖ్యలు చేశారు. కోడెల శివప్రసాదరావును ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పెట్టారని, ఆయన వీరోచితంగా పోరాడినా ఆయన ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందన్నారు టీడీపీ అధినేత. వైసీపీ నేతలు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నా సీఎం జగన్ మౌనంగా ఉన్నారని ఆరోపించారు. ఘటనపై ప్రజలకు వివరణ ఇవ్వకపోతే వారి ముందు దోషులుగా నిలబెడతామని హెచ్చరించారు.


@ncbn టీడీపీని ఒక సర్కస్ ట్రూపులా మార్చాడు. ఒక చోట టెంటు వేస్తాడు. జనం పోగవగానే షో మొదలవుతుంది. వచ్చిన వాళ్లంతా తనకు ఓట్లేసినట్టేనని హుషారై పోతాడు. సర్కస్‌ చూసి చప్పట్లు కొట్టిన వారు ఆ తర్వాత అది మర్చిపోతారని ఈయనకెప్పటికీ అర్థం కాదు. @JaiTDP

Loading...

 
First published: September 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...