పవనిజం అంటే ఇదేనేమో ? వైసీపీ ఎంపీ విమర్శలు

రేపిస్టులకు ఉరిశిక్ష ఎలా వేస్తారని ప్రశ్నిస్తున్నాడంటే మానసిక స్థితిలో ఏదో సీరియస్ ప్రాబ్లమ్ ఉన్నట్టే అని పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.

news18-telugu
Updated: December 4, 2019, 12:18 PM IST
పవనిజం అంటే ఇదేనేమో ? వైసీపీ ఎంపీ విమర్శలు
పవన్ కళ్యాణ్(ఫైల్ ఫోటో)
  • Share this:
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. వానపడుతుంటే, ఎండ కాస్తుంటే గొడుగు పట్టుకుని ఎవరైనా బయటకు వెళతారని... కానీ దత్త పుత్రుడు ఈ రెండిటికీ భిన్నమని ఎద్దేవా చేశారు. శీతాకాలంలో గొడుగుతో తిరుగుతాడని... గంట గంటకూ చిత్త భ్రమలకు లోనవుతుంటాడని పవన్ కళ్యాణ్‌పై కామెంట్లు చేశారు. ఏ సమయంలో ఏ డైలాగ్ వదులుతాడో అంతుబట్టదని వ్యాఖ్యానించారు. బిజేపీలో విలీనానికి గ్రౌండ్ ప్రిపేరు చేసుకుంటున్నాడని ఆరోపించారు. ఒకాయన 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటాడని... ఇంకొకాయన అజ్ణానాంధకారాన్ని కవర్ చేసుకునేందుకు రాజ్యాంగాన్ని ఔపోసన పట్టానంటాడని చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు విజయసాయిరెడ్డి.
రాజకీయాల్లో కొనసాగాలంటే ఇంత నీచత్వానికి పాల్పడాలా అని ప్రజలు అసహ్యించుకునే స్థాయికి ఈ ఇద్దరు దిగజారిపోయారని విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. రేపిస్టులకు ఉరిశిక్ష ఎలా వేస్తారని ప్రశ్నిస్తున్నాడంటే మానసిక స్థితిలో ఏదో సీరియస్ ప్రాబ్లమ్ ఉన్నట్టే అని పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దేశమంతా కఠినంగా శిక్షించాలని కళ్ల నీళ్లు పెంటుకుంటుంటే ఈయనకు రేపిస్టుల ప్రాణాలు ముఖ్యమై పోయాయని ఆరోపించారు. పవనిజం అంటే ఇదేనేమో? రాజకీయ పార్టీ పెట్టింది ఇందుకేనా? అని పవన్ కళ్యాణ్ తీరును తప్పుబట్టారు.


First published: December 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>