VIJAYASAI REDDY SATIRES CHANDRABABU NAIDU MIGHT BE INCREASED PAWAN KALYAN PAYMENT MS
చంద్రబాబు పవన్ పేమెంట్ పెంచినట్టున్నాడు.. అందుకే రెచ్చిపోతున్నాడు : విజయసాయి రెడ్డి
విజయసాయి రెడ్డి ఫైల్ ఫోటో(Image:Facebook)
Vijayasai Reddy slams Pawan Kalyan : రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా ఇంటలిజెన్స్ వెంకటేశ్వరరావు చంద్రబాబు తొత్తులా వ్యవహరిస్తున్నాడని, వైసీపీ అభ్యర్థుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. ఓట్ల కొనుగోలుకు పోలీసుల ద్వారానే డబ్బు పంపిణీ చేయిస్తున్నారని, ఎన్ని కుతుంత్రాలు పన్నినా ప్రజాతీర్పు ఇప్పటికే వైసీపీకి అనుకూలంగా డిసైడ్ అయిపోయిందని అన్నారు.
ఏపీలో టీడీపీ-వైసీపీ-జనసేన మధ్య మాటల యుద్దం అంతకంతకూ ముదురుతోంది. కేసీఆర్, మోదీల ప్రోద్బలంతో జగన్ ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారని టీడీపీ, జనసేన ఆరోపిస్తుంటే.. మీడియాను అడ్డు పెట్టుకుని చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేస్తున్నాడని, చంద్రబాబు స్క్రిప్టును పట్టుకుని పవన్ ఊగిపోతున్నాడని వైసీపీ ఆరోపిస్తోంది. గురువారం భీమవరంలో నామినేషన్ వేసిన సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగన్‌పై పలు విమర్శలు గుప్పించడంతో.. తాజాగా వైసీపీ నేత విజయసాయి రెడ్డి దానికి కౌంటర్ ఇచ్చారు.
పవన్ కల్యాణ్‌కు చంద్రబాబు పేమెంట్ పెంచినట్టున్నారని అందుకే రెచ్చిపోతున్నారని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణలో ప్రశాంతంగా జీవిస్తున్నవారిని రాజకీయ సమిధలుగా చేసి మాట్లాడుతున్నారని విమర్శించారు. కొంచెం కూడా బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని.. ఏప్రిల్ 11 వరకు వీరిని భరించక తప్పదేమోనని అన్నారు.
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా ఇంటలిజెన్స్ వెంకటేశ్వరరావు చంద్రబాబు తొత్తులా వ్యవహరిస్తున్నాడని, వైసీపీ అభ్యర్థుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. ఓట్ల కొనుగోలుకు పోలీసుల ద్వారానే డబ్బు పంపిణీ చేయిస్తున్నారని, ఎన్ని కుతుంత్రాలు పన్నినా ప్రజాతీర్పు ఇప్పటికే వైసీపీకి అనుకూలంగా డిసైడ్ అయిపోయిందని అన్నారు.కాగా, భీమవరం సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. సొంత బాబాయ్ చనిపోతేనే ఏమీ చేయలేనివాడు.. దానిపై నోరు మెదపనివాడు.. రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తాడని ప్రశ్నించారు. విశాఖ ఎంపీగా జనసేన జేడీ లక్ష్మి నారాయణను ప్రకటిస్తే విజయసాయిరెడ్డికి అంత ఉలుకెందుకు అని నిలదీశారు. ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డి పవన్ వ్యాఖ్యలపై కౌంటర్ ఎటాక్ చేశారు.
పేమెంటు బాగా పెంచినట్టున్నారు చంద్రబాబు. పవన్ కళ్యాణ్ తెగ రెచ్చిపోతున్నారు. తెలంగాణలో ప్రశాంతంగా జీవిస్తున్న వారిని కూడా రాజకీయ సమిధలుగా చేసి మాట్లాడుతున్నారు. కాసింత కూడా బాధ్యత లేని నీచులు చంద్రబాబు రాజ్యంలో రంకెలేస్తున్నారు. ఏప్రిల్ 11 వరకు భరించతప్పదేమో.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.