విజయసాయిరెడ్డికి కీలక పదవి... అన్నీ అనుకున్నట్టు జరిగితే...

హుటాహుటిన ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్... మొదట హోంమంత్రి అమిత్ షాను కలిశారు. వైసీపీ ఎన్డీయేలో చేరే అంశమే వీరిద్దరి మధ్య ప్రధానంగా చర్చకు వచ్చినట్టూ ప్రచారం సాగుతోంది.

news18-telugu
Updated: December 6, 2019, 1:10 PM IST
విజయసాయిరెడ్డికి కీలక పదవి... అన్నీ అనుకున్నట్టు జరిగితే...
అమిత్ షా‌తో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి (ఫైల్ ఫోటో)
  • Share this:
రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో ఎవరూ ఊహించలేరు. అందులోనూ ఢిల్లీ స్థాయి రాజకీయాలు కాస్త వేగంగా, అనూహ్యంగా మారుతుంటాయి. తాజాగా ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన సందర్భంగా ఓ ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఎన్డీయే నుంచి శివసేన బయటకు వెళ్లిపోవడంతో... ఆ స్థానంలోకి వైసీపీ రాబోతోందని ఊహాగానాలు మొదలయ్యాయి. దీనిపై చర్చించేందుకే కేంద్ర హోంమంత్రి, బీజేపీ చీఫ్ అమిత్ షా ఏపీ సీఎం జగన్‌ను ఢిల్లీకి రావాలని కోరినట్టు తెలుస్తోంది. అందుకే హుటాహుటిన ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్... మొదట హోంమంత్రి అమిత్ షాను కలిశారు. వైసీపీ ఎన్డీయేలో చేరే అంశమే వీరిద్దరి మధ్య ప్రధానంగా చర్చకు వచ్చినట్టూ ప్రచారం సాగుతోంది.

ఒకవేళ నిజంగానే వైసీపీ ఎన్డీయేలో చేరితే... ఆ పార్టీకి ఓ కేంద్రమంత్రి పదవి దక్కడం ఖాయమనే చెప్పాలి. శివసేనకు కేంద్రంలో ఓ మంత్రి పదవి ఉండటంతో... వైసీపీకి కూడా అదే స్థాయి పదవిని ఇస్తారని సమాచారం. అదే జరిగితే వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న విజయసాయిరెడ్డికి ఈ పదవి దక్కుతుందని పలువురు చర్చించుకుంటున్నారు. మోదీ, అమిత్ షాలతోనూ విజయసాయిరెడ్డికి సత్సంబంధాలు ఉండటంతో... విజయసాయిరెడ్డికి మంచి పదవి లభించే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి వైసీపీ ఎన్డీయేలో చేరితే... వైసీపీలో జగన్ తరువాత కీలకంగా ఉన్న విజయసాయిరెడ్డి రేంజ్ మరింత పెరగేలా కనిపిస్తోంది.


First published: December 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>