నారా లోకేష్ చిప్ పాడైంది... కాస్త రిపేర్ చేయండి

ఇసుక దోపిడీని అడ్డుకుంటే 24 గంటలు కరెంటు సరఫరా నిలిచి పోయినంతగా గంగ వెర్రులెత్తుతున్నారని మండిపడ్డారు.

news18-telugu
Updated: August 31, 2019, 1:21 PM IST
నారా లోకేష్ చిప్ పాడైంది... కాస్త రిపేర్ చేయండి
నారా లోకేష్ (ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: August 31, 2019, 1:21 PM IST
మరోసారి సెటైర్లతో ప్రతిపక్షంపై విరుచుకుపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు... ఆయన తనయుడు నారా లోకేష్‌పై కూడా విమర్శల వర్షం కురిపించారు. ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్తు చిత్తుగా ఓడిపోయి 3 నెలలు కాలేదు. మిమ్మల్ని ఓడించిన ప్రజలు రాక్షసులా? అంటూ నారా లోకేష్‌ను ప్రశ్నిస్తూ సాయిరెడ్డి ట్వీట్లు చేశారు.  ఏకపక్ష తీర్పుతో వారు విజయ తిలకం దిద్దిన వ్యక్తి భస్మారుడా? స్పృహలో ఉండే మాట్లాడుతున్నాడా?  అంటూ మండిపడ్డారు. ఈ వయసులోనే మెదడులో చిప్ పాడైనట్లుంది. కాస్త రిపేర్ చేయించండి. కాబోయే పార్టీ అధ్యక్షుడు కదా? అంటూ  నారా లోకేష్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఇసుక దోపిడీని అడ్డుకుంటే 24 గంటలు కరెంటు సరఫరా నిలిచి పోయినంతగా గంగ వెర్రులెత్తుతున్నారని మండిపడ్డారు. ఇసుకుపై కొత్త పాలసీ వచ్చిన తర్వాత ఇంకెంత రెచ్చి పోతారో? ఈ ధర్నాల ఉద్దేశం చూస్తుంటే, ఎప్పటిలాగే మా వాళ్లను ఇసుక బొక్కనివ్వండి సీఎం గారూ అని వేడుకుంటున్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు సాయిరెడ్డి.

రాజధాని ప్రాంతాన్ని వరద ముంచెత్తినప్పటి నుంచి చంద్రబాబు  నాయుడు దెయ్యం పట్టిన వాడిలా మారిపోయారని విమర్శించారు విజయసాయిరెడ్డి. భూములపై వందల కోట్లు పెట్టుబడి పెట్టిన తన బినామీలు, బంధువర్గం పరిస్థితి ఏమవుతుందనే బెంగ పట్టుకుందని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేత అయి ఉండీ రియల్ ఎస్టేట్ వ్యాపారిలా తాటాకు చప్పుళ్లు చేయిస్తున్నారని విమర్శించారు.  రాజకీయాల్లో హింసా ప్రవృత్తికి ఆద్యుడు చంద్రబాబే అన్నారు.  ఆయన ఐదేళ్ల రాక్షస పాలనలో వందల మంది వైసీపీ నేతలు జైళ్ల పాలయ్యారన్నారు. వేల మందిని గ్రామాల నుంచి తరిమేశారని ఆరోపించారు. 600 మందిని హత్య చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి. వృద్ధ జంబూకం శాంతి వచనాలు పలికినట్టు ఇప్పుడు వేధింపుల గురించి మాట్లాడుతున్నారన్నారు.





First published: August 31, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...