వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా విజయసాయిరెడ్డి... మిథున్ రెడ్డికి కీలక పదవి

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి(ఫైల్ ఫోటో)

అంతా అనుకున్నట్టుగానే పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డికి వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా అవకాశం కల్పించారు జగన్. ఇక లోక్ సభాపక్ష నేతగా రాజంపేట ఎంపీ, జగన్‌కు సన్నిహితుడైన మిథున్ రెడ్డికి అవకాశం దక్కింది.

  • Share this:
    వైసీపీ తరపున పార్లమెంట్‌లో నాయకత్వం వహించే నేతలను ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖరారు చేశారు. అంతా అనుకున్నట్టుగానే పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డికి వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా అవకాశం కల్పించారు జగన్. ఇక లోక్ సభాపక్ష నేతగా రాజంపేట ఎంపీ, జగన్‌కు సన్నిహితుడైన మిథున్ రెడ్డికి అవకాశం దక్కింది. లోక్‌సభలో పార్టీ చీఫ్ విప్‌గా రాజమండ్ర ఎంపీ మార్గాని భరత్‌కు వైఎస్ జగన్ ఛాన్స్ ఇచ్చారు. ఈ మేరకు వైసీపీ అధినేత జగన్ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రికి లేఖ రాశారు. వైసీపీ లోక్‌సభాపక్ష నేతగా మచిలీపట్నం ఎంపీ బాలశౌరికి అవకాశం దక్కుతుందని ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది. అయితే జగన్ మాత్రం మిథున్ రెడ్డి వైపు మొగ్గుచూపారు. ఇక వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికైన విజయసాయిరెడ్డి...రాజ్యసభలో ఆ పార్టీకి నేతృత్వం వహించనున్నారు. ఇక ఇప్పటికే టీడీపీ తమ పార్లమెంటరీ పార్టీ నేతగా గల్లా జయదేవ్‌ను ఎంపిక చేసింది. టీడీపీ రాజ్యసభాపక్ష నేతగా సుజనా చౌదరి, లోక్ సభాపక్ష నేతగా రామ్మోహన్ రావుకు అవకాశం కల్పించింది.
    First published: