ట్విట్టర్ వేదికగా తెగ తిట్టుకుంటున్న విజయసాయిరెడ్డి, నాగబాబు...

విజయసాయిరెడ్డి, నాగబాబు

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, జనసేన నేత నాగబాబు మధ్య ట్విట్టర్ వేదికగా బీభత్సమైన యుద్ధం జరుగుతోంది.

 • Share this:
  వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, జనసేన నేత నాగబాబు మధ్య ట్విట్టర్ వేదికగా ఫైట్ నడుస్తోంది. ఇద్దరూ పరస్పరం విమర్శలు గుప్పించుకుటున్నారు. పవన్ కళ్యాణ్‌ను పావలా బ్యాచ్ అంటూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానిస్తే, విజయసాయిరెడ్డిని శతకోటి గొట్టాల్లో ఓ గొట్టం అంటూ నాగబాబు ఎదురుదాడి చేశారు. అంతకు ముందు ఏపీ ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌‌కు ప్రభుత్వం ఉద్వాసన పలకడంతో జనసేన అధినేత స్పందించారు. కరోనా సమయంలో ఎలాంటి రాజకీయ విమర్శలు చేయవద్దని అనుకున్నామని, అయితే, ఆ పరిస్థితిని వైసీపీనే కల్పించిందంటూ మండిపడ్డారు. దీనిపై స్పందించిన విజయసాయిరెడ్డి అసలు రాజకీయాలు చేయడానికి నీకు గ్రౌండ్ ఉంటేగా? అంటూ పవన్ కళ్యాణ్‌ను ఎద్దేవా చేశారు.  దీనికి నాగబాబు కౌంటర్ ఇచ్చారు. విజయసాయిరెడ్డి చెప్పింది కరెక్టేనంటూ ఎదవ రాజకీయాలు చేయడానికి నీలాంటి గుంటనక్కలున్న సంగతి మాకు తెలుసంటూ ఘాటుగా స్పందించారు. అలాగే, పవన్‌తో దోస్తీకి జగన్ ప్రయత్నించిన విషయాన్ని ప్రస్తావించారు.  నాగబాబుకు ట్వీట్‌కు విజయసాయిరెడ్డి మరోసారి కౌంటర్ ఇచ్చారు. ‘పావలా బ్యాచ్‌కు రోషం పొడుచుకొచ్చినట్టుంది. సినిమాలు, టీవీ షోలు చేసుకుంటూ పార్టీని గాలికి వదిలేసిన వారికి రాజకీయాలు ఎందుకు?’ అంటూ కౌంటర్ ఇచ్చారు. 2014లోనే తాము పొత్తులు పెట్టుకోలేదన్న విషయాన్ని ప్రస్తావించారు.  అయితే, విజయసాయిరెడ్డి తన ఇంటికి వచ్చింది 2014లో కాదని, 2019 ఎన్నికల ముందంటూ నాగబాబు గుర్తు చేశారు. చిరంజీవి తమ్ముళ్లు కాకపోతే కుక్కలు కూడా మొరగవు అంటూ తమ మీద చేసిన కామెంట్స్‌కు దీటుగా బదులిచ్చారు. ‘విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ ఆడిటర్ కాకపోయి ఉంటే శతకోటి గొట్టంగాళ్లలో ఓ గొట్టంగాడు’ అని వదిలేసే వాడినంటూ నాగబాబు స్ట్రాంగ్‌గా స్పందించారు.

  Published by:Ashok Kumar Bonepalli
  First published: