సొంత పార్టీ నేతకు విజయసాయిరెడ్డి సీరియస్ వార్నింగ్...

ఆనం రామనారాయణరెడ్డి ఈనెల 6న మీడియాతో మాట్లాడుతూ... కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కొంతమంది మాఫియా గ్యాంగ్‌లు, గ్యాంగ్‌స్టర్‌లకు నెల్లూరును అప్పగించారని వ్యాఖ్యానించారు.

news18-telugu
Updated: December 7, 2019, 4:51 PM IST
సొంత పార్టీ నేతకు విజయసాయిరెడ్డి సీరియస్ వార్నింగ్...
విజయసాయిరెడ్డి (File)
  • Share this:
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ, విధేయత ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. జగన్ ఆదేశాలను ఎవరు గీతదాటినా సహించేది లేదని విజయసాయిరెడ్డి తేల్చి చెప్పారు. ఏదైనా సమస్య ఉంటే సీఎం జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకురావాలని, మీడియా ముందుకు తీసుకొస్తే సహించేది లేదని కుండబద్దలు కొట్టారు. గీత దాటితే ఎంతటి వారి మీద అయినా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అయితే, విజయసాయిరెడ్డి ఇంత సీరియస్ వార్నింగ్ ఎవరికి ఇచ్చారనే చర్చ పార్టీలో జరుగుతోంది. నెల్లూరు జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని ఉద్దేశించే విజయసాయిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.

ఆనం రామనారాయణరెడ్డి ఈనెల 6న మీడియాతో మాట్లాడుతూ... కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు మాఫియాలకు అడ్డాగా మారిందన్నారు. మాఫియాలు, కబ్జాకోరులు, బెట్టింగ్ రాయుళ్లు ఎక్కువైపోయారని.. లిక్కర్, బెట్టింగ్, లాండ్, శాండ్, ఏ మాఫియా కావాలన్నా నెల్లూరు వస్తే దొరుతుకుందన్నారు. కొంతమంది మాఫియా గ్యాంగ్‌లు, గ్యాంగ్‌స్టర్‌లకు నెల్లూరును అప్పగించారని బయటకు చెప్పుకోలేక ప్రజలు కుమిలిపోతున్నారని వ్యాఖ్యానించారు. తాజాగా ఆనం రామనారాయణరెడ్డి సోదరుడు ఆనం విజయ్ కుమార్ రెడ్డిని నెల్లూరు జిల్లా డీసీసీబీ ఛైర్మన్ గా నియమిస్తూ జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

అయితే, ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యలు పరోక్షంగా జిల్లాకు చెందిన మంత్రి అనిల్‌ను ఉద్దేశించి చేసినట్టు కనిపిస్తోంది. జగన్ కేబినెట్‌లో ముఖ్యమైన శాఖను నిర్వహిస్తున్న అనిల్ కుమార్ మీద బెట్టింగ్ కేసులు ఉన్నాయి. పరోక్షంగా అనిల్‌ను ఉద్దేశించి ఆనం రామనారాయణరెడ్డి కామెంట్స్ చేయడంతో దీన్ని సీరియస్‌గా తీసుకున్న విజయసాయిరెడ్డి కూడా పరోక్షంగా ఆనంకు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆనం వ్యాఖ్యల మీద అనిల్ కూడా స్పందించారు. ఆయన అలా ఎందుకన్నారో తనకు తెలియదని చెప్పారు. గత ప్రభుత్వం గురించి మాట్లాడి ఉండొచ్చని అనిల్ వ్యాఖ్యానించారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: December 7, 2019, 4:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading