AP Local Body Elections: సైకిల్ గుర్తుకు ఓటేయాలన్న వైసీపీ ఎమ్మెల్యే... షాక్ లో పార్టీ కార్యకర్తలు

ఎన్నికల ప్రచారంలో వైసీపీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే నోరు జారారు. ఆవేశమో.. లేక మర్చిపోయారో తెలియదుగానీ ప్రత్యర్థి పార్టీకి ఓటేయాలన్నారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ ఎన్నికలు బహిష్కరించడంతో.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతోంది. ఎన్నికలను బరిష్కరిస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించినా.. స్థానికంగా మాత్రం పార్టీ నేతలు పోటీలో ఉన్నారు. ప్రచారం చేస్తున్నారు. మరోవైపు గెలుపుపై ధీమాగా ఉన్న వైసీపీ జోరుగా ప్రచారం చేస్తోంది. చాలా చోట్ల ఎమ్మెల్యేలు గెలుపు బాధ్యతను తమ భుజాలపై వేసుకున్నారు. ఈ క్రమంలో ప్రచారంలో పాల్గొన్న ఓ వైసీపీ ఎమ్మెల్యే. టీడీపీ ఎన్నికల గుర్తు అయిన సైకిల్ గుర్తుకు ఓటేయాలని ప్రజలకు పిలుపునిచ్చి.. సొంత పార్టీ నేతలకు షాకిచ్చారు.

    వివరాల్లోకి వెళ్చే... పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసు బాబు.. పార్టీ నేతలతో కలిసి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఉంగుటూరు మండలం గోపీనాథపట్నంలో వైసీపీ తరపున పోటీ చేస్తున్న జడ్పీటీసీ అభ్యర్థిని గంట శ్రీలక్ష్మి తరపున ప్రచారం చేశారు. ఈ క్రమంలో ప్రసంగించిన ఎమ్మెల్యే వాసుబాబు.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు మీ ముందుకు వచ్చారు.. మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి వారిని గెలిపంచాలంటూ నోరు జారారు. దీంతో పార్టీ అభ్యర్థులతో పాటు వైసీపీ నేతలు షాక్ కు గురయ్యారు. ఇదేంటి ఎమ్మెల్యే ఇలా అంటున్నారని అయోమయంలో పడ్డారు. ఐతే వెంటనే తేరుకున్న ఆయన.. టీడీపీ పోటీలో లేదుకాబట్టి వారిని ఎద్దేవా చేయడాని జోక్ వేశానంటూ వివరణ ఇచ్చారు. ఐతే ఓ ఎమ్మెల్యేకు పార్టీ గుర్తుమీద అవగాహన లేదా అని పలువురు చర్చించుకుంటుంటే.. టీడీపీ తరపున పోటీలో ఉన్నవారు మాత్రం తమకే లాభమంటున్నారు.

    ఇది చదవండి: హీటెక్కిన తిరుపతి రాజకీయం... జనసేనానినే టార్గెట్ చేసిన వైసీపీ


    మరోవైపు తిరుపతి ఉపఎన్నిక సందర్భంగానూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. రాష్ట్ర డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.. ఓ సభలో పాల్గొన్నారు. ఆ సమయంలో ప్రసంగంలో లీనమైన ఆయన.. హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపంచాలని పిలుపునిచ్చారు. ఆడిటోరియంలో ఉన్న వైసీపీ కార్యకర్తలు, నేతలు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఐతే వెంటనే తెరుకున్న ఆయన.. తాను హస్తం గుర్తుకు ఓటు వేయమని చెప్పలేదని.. ఓటు వేయద్దని చెప్పానని.. అందరూ తప్పుగా అర్ధం చేసుకున్నారంటూ కవర్ చేసుకున్నారు.

    ఐతే ఎన్నికల ప్రచారంలో నేతలు నోరుజారడం ఇదే మొదటిసారి కాదు. ప్రత్యర్థి పార్టీలను విమర్శించడంలో భాగంగా.. ఆ పార్టీల గుర్తులకు ఓటు వేయమని పిలుపునిచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇలాంటి ఘటనలు పొలిటికల్ సర్కిల్స్ లో వైరల్ అవుతున్నా.. ఆయా పార్టీలకు వచ్చే నష్టం ఏమీలేదు.
    Published by:Purna Chandra
    First published: