బిల్లును 4 నెలలే మండలి ఆపగలదు... వీడియోలో చంద్రబాబు

మండలి రద్దు తీర్మానంపై ఏపీ అసెంబ్లీలో చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఇదివరకు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.

news18-telugu
Updated: January 27, 2020, 1:47 PM IST
బిల్లును 4 నెలలే మండలి ఆపగలదు... వీడియోలో చంద్రబాబు
దళితులపై ఈ విధమైన గొలుసుకట్టు దాడులు, ఆలయాలపై దాడులు రాష్ట్ర చరిత్రలో ఉన్నాయా..? దేశంలో ఏ రాష్ట్రంలోనైనా జరుగుతున్నాయా..? కొందరు పోలీసుల ఉదాసీనత చూసి నేరగాళ్లు రెచ్చిపోతున్నారని చంద్రబాబు విమర్శించారు.
  • Share this:
ఏపీ శాసన మండలి రద్దుపై సీఎం జగన్... అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడంతో... దానిపై సభ్యులు తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా... మంత్రి పేర్ని నాని ఓ వీడియోని ప్రజల ముందుకు తెచ్చారు. అది టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకి సంబంధించినది. అందులో చంద్రబాబు ఏం మాట్లాడారో పేర్ని నాని వివరించారు. చంద్రబాబు తన 40 ఏళ్ల అనుభవంతో... రకరకాల చేతబడులు చేశారని విమర్శించిన ఆయన... జగన్ కాలి గోటిని కూడా కదపలేరని అన్నారు. ఇప్పుడు చంద్రబాబు... శాసన మండలి ప్రయోజనాలు, అవసరాలు, ప్రాధాన్యం, ప్రాముఖ్యతపై ఎన్నో మాటలు చెబుతున్నారన్న పేర్ని నాని... అదే చంద్రబాబు... ఇదివరకు మండలి గురించి ఏం మాట్లాడారో వీడియో రూపంలో చూడండి అంటూ అసెంబ్లీలో సభ్యులకు ఓ వీడియోని ప్లే చేసి చూపించారు. అందులో ఇదివరకు వైఎస్ హయాంలో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి... మండలిని ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు... చంద్రబాబు చేసిన వ్యాఖ్యలున్నాయి.

ఆ వీడియోలో చంద్రబాబు... మండలి ఏర్పాటు వల్ల ఏ ప్రయోజనమూ లేదనీ... అది కేవలం వైఎస్ తాలూకు వారికి పదవులు ఇచ్చేందుకే ఏర్పాటు చేయాలనుకుంటున్నారు తప్ప మరో ప్రయోజనం లేదని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులకు మండలి ద్వారా రాజకీయ పునరావాసం కల్పించాలనుకుంటున్నారని మండిపడ్డారు. మండలి వల్ల బ్రహ్మాండమైన చట్టాలు రావనీ, రాష్ట్రానికి ప్రయోజనం కలగదనీ అన్నారు. చారిత్రక పరంగా చూసినా ఆ మండలి అవసరం లేదన్నారు. అప్పుడున్న అసెంబ్లీలో 294 మందిలో మంచి క్వాలిటీ ఉన్న సభ్యులు, అనుభవం ఉన్న సభ్యులు వచ్చారన్న చంద్రబాబు... మండలి అవసరం లేదన్నారు. మండలి వల్ల ఆర్థిక భారం పడుతుందనీ, బిల్లులు ఆమోదం ఆలస్యం అవుతుందనీ అన్న చంద్రబాబు... ఏదైనా ఓ బిల్లు చట్టం కాకుండా అడ్డుకునే శక్తి మండలికి 4 నెలలు మాత్రమే ఉంటుందన్నారు. తర్వాత ఆటోమేటిక్‌గా ఆ బిల్లు చట్టంగా అవుతుందని అన్నారు. మండలికి కొన్ని అధికారాలే వస్తాయన్న చంద్రబాబు... అందులో మేధావులు వస్తారన్న అభిప్రాయం కూడా లేదన్నారు.

ఓవరాల్‌గా చూస్తే... మొన్న మండలి రద్దు ప్రతిపాదన చేస్తూ... సీఎం జగన్ ఏ వ్యాఖ్యలైతే చేశారో... వైఎస్ హయాంలో ప్రతిపక్ష నేతగా ఉంటూ... చంద్రబాబు కూడా అవే వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియోని ప్లే చేయడం ద్వారా... చంద్రబాబు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని వైసీపీ సభ్యులు మండిపడ్డారు.
Published by: Krishna Kumar N
First published: January 27, 2020, 1:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading