Home /News /politics /

VIDEO OF MINISTER PRADYUMAN SINGH TOMAR SLAPPING A WOMAN IN THE VEGETABLE MARKET HAS GONE VIRAL ON SOCIAL MEDIA SNR

నా చెంప పగలగొట్టండి..కూరగాయల మార్కెట్‌లో మహిళను కోరిన మంత్రి ప్రద్యుమాన్‌ సింగ్ తోమర్

Photo Credit :Youtube

Photo Credit :Youtube

OMG: మధ్యప్రదేశ్‌కి చెందిన మంత్రి ప్రద్యుమాన్‌ సింగ్ తోమర్ ఓ వృద్ధురాలిని చెంప దెబ్బ కొట్టమని కోరారు. సమస్యలు ఆలకించేందుకు వెళ్లిన మంత్రికి సమస్యలు చెప్పుకున్నారు అక్కడి చిరు వ్యాపారులు. వాళ్ల ఫిర్యాదులు ఆలకించిన మంత్రి ఇందులో తన తప్పేమైన ఉంటే చెంప దెబ్బలు కొట్టమని కోరడం చర్చనీయాంశమైంది.

ఇంకా చదవండి ...
మధ్యప్రదేశ్‌కి చెందిన ఓ మంత్రి పేరు ఎక్కడ చూసినా బాగా వినిపిస్తోంది. ఆయన ప్రజలకు దగ్గరవుతున్నారో , లేక వార్తల్లో ఉండాలని భావిస్తున్నారో తెలియదు కాని ఆయన ప్రవర్తన మాత్రం మిగిలిన ప్రజాప్రతినిధులతో పోలిస్తే కొంచెం భిన్నంగానే ఉంటోంది. అంత వెరైటీ మినిస్టర్ ఎవరో కాదు మధ్యప్రదేశ్(Madhya pradesh) ఇంధనశాఖ మంత్రి( Enegry minister)ప్రద్యుమాన్ సింగ్ తోమర్(Pradhuman Singh Tomar). ఓ కూరగాయల మార్కెట్‌ సందర్శనకు వెళ్లిన సమయంలో మంత్రిగారు వ్యవహరించిన తీరు అందర్ని విస్మయానికి గురి చేస్తోంది. గ్వాలియర్‌(Gwalior)లోని కూరగాయల మండి(Vegetable market)ని పరిశీలించడానికి వెళ్లారు మంత్రి ప్రద్యుమాన్‌ సింగ్‌ తోమర్(Pradhuman Singh Tomar). అక్కడున్న ఓ వృద్ధురాలి రెండు చేతులు తీసుకొని చెంప మీద కొట్టండి అని కోరారు. దీంతో మంత్రి వెంట ఉన్న అనుచరులతో పాటు అక్కడున్న వాళ్లంతా ఆశ్చర్యపోయారు. ఒక మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి కూరగాయల మార్కెట్‌లో వ్యాపారం చేసుకునే వృద్ధురాలి(Old woman)ని కొట్టమని కోరుతున్నాడేంటని అంతూ విస్తూపోయారు. ఈ సీన్‌ జరగడానికి అసలు కారణం ఏమిటంటే గ్వాలియర్‌కి మార్చిన కూరగాయల వ్యాపారాలు మొత్తం గతంలో హజీరాలోని హజీరా కూరగాయల మార్కెట్‌లో ఉండేవి. వాటిని మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు ఉన్నపళంగా గ్వాలియర్‌ మార్కెట్‌కి తరలించారు. ఈ విషయంలో అక్కడ ఏర్పాటు చేసిన కూరగాయల మండిని పరిశీలించేందుకు వ్యాపారుల సమస్యలు అడిగి తెలుసుకునేందుకు వెళ్లారు మంత్రి ప్రద్యుమాన్‌సింగ్‌ తోమర్. మంత్రి వెళ్లి ఓ వృద్దురాలి ముందు కూర్చొని మీకు ఇక్కడ సమస్యలు ఏమైనా ఉన్నాయా అంటూ ప్రశ్నించడంతో ఆ వృద్ధురాలు మున్సిపల్‌ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. తమ వ్యాపార దుకాణాలు వేరే చోటికి మార్చడం సరైన నిర్ణయమేనా అంటూ మంత్రిని ప్రశ్నించింది. దానికి బదులుగానే మంత్రి ఆమె రెండు చేతులను తన చేతుల్లో తీసుకొని నన్ను కొట్టండి ..చెంపపైన కొట్టండి ..ఏం మీ కొడుకు తప్పు చేస్తే దండించే హక్కు తల్లిగా మీకు లేదా..అలాగే నేను తప్పు చేశానని మీకు అనిపిస్తే కొట్టండి అంటూ వృద్ధురాలితో చనువుగా ప్రవర్తించారు.

తప్పు చేస్తే చెంప పగలగొట్టండి..
అప్పటి వరకూ తీవ్ర ఆగ్రహంతో ఉన్న మార్కెట్‌లోని చిన్న, చితక వ్యాపారాలు మంత్రి ప్రద్యుమన్‌ సింగ్‌ తోమర్‌ తీరు చూసి శాంతించారు. చివరకు కూరగాయలు అమ్ముకునే వృద్దురాలు మంత్రి తలను తన భుజానికి హత్తుకుంది. దీంతో మంత్రి ఆమె పాదాలకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. మంత్రి చిరు వ్యాపారుల పట్ల చూపించిన అన్యోన్యత, ఆదరణకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.

ఆ మంత్రి రూటే సెపరేటు..
మధ్యప్రదేశ్‌ మినిస్టర్ ప్రద్యుమాన్‌ సింగ్ తోమర్‌కి ఇదేం కొత్త కాదు. గతంలో కూడా చాలా సార్లు రోడ్లపై చెత్త ఊడ్వటం, మురుగు కాలువలోకి దిగి పేరుకుపోయిన వ్యర్దాలను తొలగించడం, పబ్లిక్‌ టాయిలెట్స్‌ పరిశీలించి వాటిని శుభ్రపరచడం వంటివి చేసి పబ్లిక్‌లో, మీడియాలో బాగా పాపులర్ అయ్యారు. ఇప్పుడు అదే రూట్‌లో వెళ్లి మంత్రి కూరగాయల వ్యాపారులకు దగ్గరయ్యారయ్యారని చెప్పుకుంటున్నారు నియోజకవర్గ ప్రజలు.
Published by:Siva Nanduri
First published:

Tags: Madhya pradesh, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు