జగన్‌కు షాక్... ఏపీ రాజధానిపై వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు

‘నా 42 ఏళ్ళ అనుభవం తో ఈ మాట చెపుతున్నా...వివాదం కోసమో, రాజకీయం కోణంలోనో నా అభిప్రాయం చూడవద్దన్నారు వెంకయ్య నాయుడు.

news18-telugu
Updated: December 25, 2019, 11:05 AM IST
జగన్‌కు షాక్... ఏపీ రాజధానిపై వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు
వైఎస్ జగన్, వెంకయ్యనాయుడు
  • Share this:
స్వర్ణ భారతి ట్రస్ట్ లో మీడియాతో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ రాజధానికి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణకు తాను మొదటి నుంచి కట్టుబడి ఉన్నానన్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత కేంద్ర సంస్థ లను అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసామన్నారు. కేంద్ర మంత్రిగా నాడు ప్రత్యేకంగా చొరవ తీసుకుని జిల్లాకో కేంద్ర సంస్థ ఏర్పాటు అయ్యేలా చూసానన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఇలా జరగాలన్నారు వెంకయ్య నాయుడు. పాలన ఒక్క చోట నుంచే ఉండాలనేది తన నిశ్చితాభిప్రాయమన్నారు. ముఖ్యమంత్రి, పాలనా యంత్రంగం హైకోర్టు, అసెంబ్లీ ఒక్క చోటనే ఉండాలని పేర్కొన్నారు. అన్ని ఒక్క చోట ఉంటేనే పాలనలో సౌలభ్యం ఉంటుందన్నారు. అది ఎక్కడ అనేది రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానికే వదలిస్తున్నాన్నారు వెంకయ్య. ‘నా 42 ఏళ్ళ అనుభవం తో ఈ మాట చెపుతున్నా...వివాదం కోసమో, రాజకీయం కోణంలోనో నా అభిప్రాయం చూడవద్దన్నారు. ఏపీ రాజధానిపై తనను కేంద్రం అడిగితే తాను ఇదే అభిప్రాయం చెబుతానన్నారు. మాతృభాషకు ప్రాధాన్యం విషయంలో కూడా తనది మొదటి నుంచి ఒకటే అభిప్రాయమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగులో ప్రాధమిక బోధన ఉండాలనేదే తన అభిప్రాయంమన్నారు. ప్రధాని సైతం మాతృ భాషకు ప్రాధాన్యం పై అనేక సార్లు చెప్పారన్నారు.
Published by: Sulthana Begum Shaik
First published: December 25, 2019, 11:04 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading