నేడు ఆంధ్రప్రదేశ్‌కు ఉపరాష్గ్రపతి వెంకయ్యనాయుడు..!

మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. అనంతరం అక్కడ్నుంచి బయల్దేరి9.30 గంటల ప్రాంతంలో భారతీయ విద్యాభవన్ లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు.

news18-telugu
Updated: September 24, 2018, 8:05 AM IST
నేడు ఆంధ్రప్రదేశ్‌కు ఉపరాష్గ్రపతి వెంకయ్యనాయుడు..!
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(ఫైల్ ఫోటో)
  • Share this:
ఇవాళ ఏపీలో పర్యటించనున్నారు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఇవాళ సాయత్రం 4.30 గంటలకు భారతీయ వాయుసేన విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ్నుంచి బయల్దేరి సాయంత్రం 6 గంటలకు కుర్రకాల్వ వద్ద కొత్తగా నిర్మించిన ఇండియన్ కలినరీ ఇనిస్టిట్యూట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని తిరుమలకు వెళ్తారు. అక్కడ రాత్రి బస చేసి మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. అనంతరం అక్కడ్నుంచి బయల్దేరి9.30 గంటల ప్రాంతంలో భారతీయ విద్యాభవన్ లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. రాస్ స్వచ్ఛంద సంస్థ మహతి ఆడిటోరియంలో నిర్వహించే కార్యక్రమంలో మధ్యాహ్నం 12 గంటలకు పాల్గొననున్నారు. తిరిగి మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని అక్కడ్నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు.
Published by: Sulthana Begum Shaik
First published: September 24, 2018, 8:05 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading