సీఎం జగన్‌కు వెంకయ్య సలహా... మీరు అలా చేయొద్దంటూ...

రాష్ట్రంలో పరిపాలన నిర్మాణాత్మకంగా ఉండాలని... నిర్ణయాలు కూడా అదే రకంగా ఉండాలని ఆయన సీఎం జగన్‌కు సలహా ఇచ్చినట్టు సమాచారం. వెంకయ్యనాయుడు జగన్‌కు ఈ రకమైన సలహాలు ఇవ్వడానికి ప్రత్యేకమైన కారణాలు కూడా ఉన్నాయని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

news18-telugu
Updated: August 8, 2019, 12:32 PM IST
సీఎం జగన్‌కు వెంకయ్య సలహా... మీరు అలా చేయొద్దంటూ...
వైఎస్ జగన్, వెంకయ్యనాయుడు
  • Share this:
రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... ప్రధాని నరేంద్రమోదీ సహా అనేకమంది ప్రముఖులను కలిశారు. ఈ జాబితాలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఉన్నారు. ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పటికీ... ఏపీ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునే వెంకయ్యనాయుడు... పరిపాలన విషయంలో జగన్‌కు పలు సూచనలు ఇచ్చారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీ ప్రస్తావన తీసుకొచ్చిన వెంకయ్యనాయుడు... సీఎం జగన్‌కు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో అనేక తప్పులు చేయడం వల్లే టీడీపీ ప్రభుత్వం ఓటమి పాలైందని... మీరు అలాంటి తప్పులు చేయడానికి అవకాశం కల్పించవద్దని వెంకయ్యనాయుడు సీఎం జగన్‌కు సూచించినట్టు తెలుస్తోంది.

రాష్ట్రంలో పరిపాలన నిర్మాణాత్మకంగా ఉండాలని... నిర్ణయాలు కూడా అదే రకంగా ఉండాలని ఆయన సీఎం జగన్‌కు సలహా ఇచ్చినట్టు సమాచారం. అయితే వెంకయ్యనాయుడు జగన్‌కు ఈ రకమైన సలహాలు ఇవ్వడానికి ప్రత్యేకమైన కారణాలు కూడా ఉన్నాయని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. పోలవరం, పీపీఏ అంశాలపై వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై కేంద్రం నుంచి కూడా అసంతృప్తి వ్యక్తమైంది. ఈ కారణంగానే వెంకయ్యనాయుడు సీఎం జగన్‌కు ఈ రకమైన సూచనలు చేసి ఉంటారని టాక్ వినిపిస్తోంది. ఏపీలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాష్ట్ర ప్రయోజనాలకు నెరవేర్చేందుకు తన వంతు ప్రయత్నం ఎప్పుడూ చేస్తానని వెంకయ్యనాయుడు సీఎం జగన్‌కు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

First published: August 8, 2019, 12:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading