పార్టీ ఫిరాయింపులపై వెంకయ్య ఆసక్తికర వ్యాఖ్యలు

దేశంలో జరుగుతున్న పార్టీ ఫిరాయింపులపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

news18-telugu
Updated: August 27, 2019, 11:26 AM IST
పార్టీ ఫిరాయింపులపై వెంకయ్య ఆసక్తికర వ్యాఖ్యలు
వెంకయ్య నాయుడు(File)
  • Share this:
పార్టీ ఫిరాయింపులపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి రాజ్యాంగంలో టెన్త్ షెడ్యూల్‌లో స్పష్టత లేదని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని వెంకయ్య వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ తగిన సమయంలో నిర్ణయం తీసుకోకపోతే ఏం చేయాలనే అంశంపై రాజ్యాంగంలో స్పష్టత లేదని వెంకయ్యనాయుడు అన్నారు. న్యాయస్థానాల్లోనూ దీనికి సంబంధించిన కేసుల విచారణ నిర్ణీత గడువులో జరగడం లేదని అన్నారు. తమిళనాడులో కేంద్ర మాజీమంత్రి చిదంబరం 2009లో ఎన్నికవడంపై కొనసాగుతున్న కేసు అంశాన్ని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు పరోక్షంగా ప్రస్తావించారు.

కొద్దిరోజుల క్రితం ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం పార్టీ మారిన టీడీపీ ఎంపీల విషయంలో రాజ్యసభ చైర్మన్‌గా ఉన్న వెంకయ్యనాయుడు తీరు సరికాదని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడలో జరిగిన ఆత్మీయ సమావేశంలో వెంకయ్యనాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. ఉపరాష్ట్రపతి పదవిని ప్రజలకు చేరువ చేయాలన్నదే తన ఆకాంక్ష అని వెంకయ్యనాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రి కొడాలి నాని, మాజీమంత్రి కామినేని శ్రీనివాస్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
Published by: Kishore Akkaladevi
First published: August 27, 2019, 11:26 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading