షాద్నగర్ నిర్భయ ఘటనపై తీవ్రంగా స్పందించారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. దేశ వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయన్నారు. మహిళలపై దాడులు చేయడం ఒక సామాజిక రోగంగా మారపోయిందన్నారు. పోలీస్ వ్యవస్థలో కూడా చాలా లోపాలున్నాయన్నారు. ఫిర్యాదు చేసేందుకు వస్తే... తమ పరిధి కాదని పోలీసులు ఎలా చెబుతారని ప్రశ్నించారు. కేవలం కోర్టులు, చట్టాలు చేస్తే బాధితులకు న్యాయం జరగదన్నారు. ఈ పరిస్థితిపై మార్పు రావడానికి సమాజం అంతా కృషి చేయాలన్నారు. ఇలాంటి కేసుల్లో బాధితులకు సత్వరమే న్యాయం లభించాలన్నారు వెంకయ్య నాయుడు. పిల్లల్లో నైతిక విలువల్ని తల్లిదండ్రులు పెంపొందించాలన్నారు. సామాజిక చైతన్యంతోనే నేరాలకు అడ్డుకట్ట పడుతుందన్నారు.
అంతకుముందు రాజ్యసభలో చర్చ సందర్భంగా పలువురు ఎంపీలు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. మహిళా ఎంపీలు ఈ ఘటనపై మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేసి... నిందితులకు కఠిన శిక్ష అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.
Published by:Sulthana Begum Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.