ఏపీ మూడు రాజధానులపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కామెంట్స్

పల్లెల నుంచి పట్టణాలకు వలసలు పెరిగిపోయాయని.. అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు విస్తరించాలని అభిప్రాయపడ్డారు. వికేంద్రీకరణలో భాగంగానే తాడేపల్లి గూడెంలో నిట్ సంస్థను నెలకొల్పినట్లు ఉప రాష్ట్రపతి వెల్లడించారు.

news18-telugu
Updated: December 24, 2019, 7:45 PM IST
ఏపీ మూడు రాజధానులపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కామెంట్స్
వెంకయ్య నాయుడు(File)
  • Share this:
ఏపీలో మూడు రాజధానుల వ్యవహారంపై దుమారం కొనసాగుతోంది. అమరావతి నుంచి రాజధానిని తరలించొద్దని రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అమరావతి కోసం తమ జీవితాలనే త్యాగం చేశామని.. ఇప్పుడు రాజదానిని తరలిస్తే తామంతా ఎక్కడికి పోవాలని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఈ క్రమంలో రాజధానికి చెందిన రైతులు కృష్ణాజిల్లాలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిశారు. అమరావతి నుంచి రాజధాని తరలింపు, ప్రభుత్వ వైఖరిపై వెంకయ్యనాయుడికి రాజధాని రైతులు వినతీ పత్రం సమర్పించారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని అందులో పేర్కొన్నారు. మూడు పంటలు పండే పొలాలను రాష్ట్ర అభివృద్ధి కోసం ఇచ్చామని.. ప్రభుత్వాన్ని నమ్మి రాజధానికి భూములను కట్టబెట్టామని వాపోయారు. వారి విజ్ఞప్తిపై స్పందించిన వెంకయ్య.. ప్రస్తుతం తాను రాజకీయాల్లో లేనని.. ఏ ప్రభుత్వంలోనూ లేనని తెలిపారు. ఉపరాష్ట్రపతిగా ఏదీ బహిరంగంగా మాట్లాడలేనని స్పష్టంచేశారు.

ఇక మంగళవారం ఉదయం తాడేపల్లిగూడెం నిట్ స్నాతకోత్సవంలో పాల్గొన్న వెంకయ్యనాయుడు.. అభివృద్ధి వికేంద్రీకరణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పల్లెల నుంచి పట్టణాలకు వలసలు పెరిగిపోయాయని.. అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు విస్తరించాలని అభిప్రాయపడ్డారు. వికేంద్రీకరణలో భాగంగానే తాడేపల్లి గూడెంలో నిట్ సంస్థను నెలకొల్పినట్లు ఉప రాష్ట్రపతి వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు వచ్చినప్పటికీ.. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతోనే తాడేపల్లిగూడెంలో నిట్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఉపరాష్ట్రపతి.

'' అన్నీ జిల్లా కేంద్రం, రాజధాని, ఢిల్లీలోనే ఉంటే అందరం అక్కడికే వెళ్లాల్సి ఉంటుంది. ఈ కారణంగానే వలసలు పెరుగుతున్నాయి. అందుకే అభివృద్ధి వికేంద్రీకరణ జరగి అన్ని ప్రాంతాలు అభివృద్థి చెందాలి. నేను ఏపీ రాజధాని నెలకొన్న రాజకీయాల గురించి మాట్లాడం లేదు. అది అడ్మినిస్ట్రేటివ్ నిర్ణయం. డెవలప్‌మెంట్ డీ సెంట్రలైజేషన్ ద్వారా అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసి వలసలను నివారించాల్సిన అవసరం ఉంది.'' అని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు.
Published by: Shiva Kumar Addula
First published: December 24, 2019, 7:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading