బీరు, బిర్యానీ, బేటా... వెంకయ్య సంచలన వ్యాఖ్యలు

ఎన్నికల్లో ధర ప్రవాహాన్ని ఆపాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఎన్నికల కమిషన్ ప్రతి ఇంటికి వచ్చి చూడలేదని ఆయన వ్యాఖ్యానించారు.

news18-telugu
Updated: January 9, 2020, 1:03 PM IST
బీరు, బిర్యానీ, బేటా... వెంకయ్య సంచలన వ్యాఖ్యలు
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు(ఫైల్ ఫోటో)
  • Share this:
ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని ఆపాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఎన్నికల కమిషన్ ప్రతి ఇంటికి వచ్చి చూడలేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుత తరుణంలో మారాల్సింది వ్యవస్థ కాదని... ప్రజలే మారాలని ఆయన అన్నారు. నేతలు ఓట్లు కొంటున్నారని... ప్రజలు ఓట్లు అమ్ముకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో నేతలు కోట్లు ఖర్చు పెడుతున్నారని... గెలవగానే అవినీతి చేస్తారని అన్నారు. ఎన్నికల ముందు అన్నీ ఫ్రీ అంటారని... గెలిచాక చేతులెత్తేస్తారని వెంకయ్య వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇప్పుడు సభలకే కోట్లు ఖర్చు పెడుతున్నారని... పార్టీలు సభలు పెట్టేందుకు మూడు బి లు పాటిస్తున్నాయని అన్నారు.మూడు బి లు అంటే బీరు, బిర్యానీ, బేటా అని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో జిరగిన మనీ పవన్ ఇన్ ఎలక్షన్స్‌పై జరిగిన సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఒకే సారి ఎన్నికలు జరిగితే అభివృద్ధికి ఆటంకం ఉండదని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. పంచాయతీ నుంచి పార్లమెంట్‌ వరకు ఒకే సారి ఎన్నికలు జరిగితే అభివృద్ధికి ఆటంకం ఉండదని పేర్కొన్నారు. ఎన్నికల ఖర్చు ప్రభుత్వమే ఇవ్వాలనేది సరికాదన్నారు. వాజపేయి వంటి మహనీయుల సభలకు వెళ్తే సొంత ఖర్చుతో వెళ్లే వాళ్లమని గుర్తుచేశారు.
Published by: Kishore Akkaladevi
First published: January 9, 2020, 12:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading