రాజ్యసభలో కన్నీరుమున్నీరైన వెంకయ్య.. జైపాల్ రెడ్డిని తలుచుకుని భావోద్వేగం..

తన ఎమోషన్స్‌ను అదుపు చేసుకోలేకపోతున్నందుకు సభ్యులకు సారీ చెప్పారు. జైపాల్‌ రెడ్డితో తనకున్న అనుబంధం వల్ల ఆయన లేరన్న విషయాన్ని తట్టుకోలేకపోతున్నానని చెప్పారు.

news18-telugu
Updated: July 29, 2019, 9:25 PM IST
రాజ్యసభలో కన్నీరుమున్నీరైన వెంకయ్య..  జైపాల్ రెడ్డిని తలుచుకుని భావోద్వేగం..
సభలో వెంకయ్య నాయుడు
  • Share this:
మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి(77) మృతిపై రాజ్యసభలో సంతాపం సందర్భంగా సభా ఛైర్మన్ వెంకయ్య నాయుడు కన్నీరుమున్నీరయ్యారు. జైపాల్ రెడ్డితో తన అనుబంధాన్ని గుర్తుతెచ్చుకుని భావోద్వేగానికి లోనయ్యారు. తమ ఇద్దరిదీ 40ఏళ్ల అనుబంధం అని.. అసెంబ్లీలో ఒకే బెంచీలో కూర్చునేవారమని గుర్తుచేసుకున్నారు. ఆయన తనకన్నా ఆరేళ్లు పెద్దవారని.. చాలా విషయాల్లో తనకు సలహాలు ఇస్తుండేవారని చెప్పారు.దేశం ఒక గొప్ప పార్లమెంటేరియన్‌ను కోల్పోయిందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. జైపాల్ రెడ్డి అద్భతమైన వక్త అని, సమర్థవంతమైన పాలనాధక్షుడని కొనియాడారు. తెలివి తేటల్లో,విషయ పరిజ్ఞానంలో, భాషా ప్రావీణ్యంలో ఆయనకున్న పట్టు అద్భుతమని ప్రశంసించారు.ఆయన ఇలా వెళ్లిపోవడం చాలా బాధాకరంగా ఉందన్నారు. తన ఎమోషన్స్‌ను అదుపు చేసుకోలేకపోతున్నందుకు సభ్యులకు సారీ చెప్పారు. జైపాల్‌ రెడ్డితో తనకున్న అనుబంధం వల్ల ఆయన లేరన్న విషయాన్ని తట్టుకోలేకపోతున్నానని చెప్పారు. కాగా, జైపాల్ రెడ్డి మృతికి ఉభయ సభలు సంతాపం ప్రకటించాయి. సభ్యులంతా రెండు నిమిషాలు మౌనం పాటించి జైపాల్ రెడ్డికి నివాళులు
అర్పించారు.
Published by: Srinivas Mittapalli
First published: July 29, 2019, 9:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading