ఆ ఐదు.. అభివృద్ది మార్గానికి వెంకయ్య చెప్పిన సూత్రాలు..

జనాభాలో ఇప్పటికీ 18 నుంచి 20 శాతం మంది దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్నారని వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు రంగాలకు చెందిన సంస్థలు దారిద్ర్య నిర్మూలనుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

news18-telugu
Updated: February 9, 2019, 1:46 PM IST
ఆ ఐదు.. అభివృద్ది మార్గానికి వెంకయ్య చెప్పిన సూత్రాలు..
వెంకయ్య నాయుడు(File)
  • Share this:
అభివృద్ధి ప్రణాళిక ఏదైనా సరే.. అది పరిపూర్ణం కావాలంటే ఐదు అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. ప్రజలు, శ్రేయస్సు, భూగ్రహం, శాంతి, భాగస్వామ్యం అనే ఐదు అంశాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి మార్గంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. హైదరాబాద్‌లో తార్నాకలోని ఇఫ్లూ (ఇంగ్లీష్&ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ)లో నిర్వహించిన వజ్రోత్సవాల్లో శనివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ అభివృద్ది గురించి, అందుకు అవసరమైన చర్యల గురించి మాట్లాడారు.

జనాభాలో ఇప్పటికీ 18 నుంచి 20 శాతం మంది దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్నారని వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు రంగాలకు చెందిన సంస్థలు దారిద్ర్య నిర్మూలనుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పేదరిక నిర్మూలకు అవసరమైన అన్ని రకాల ప్రయత్నాల్లో భాగస్వాములు కావాలని తెలిపారు.ప్రకృతితో కలిసి జీవించడం భారతీయ సంస్కృతిలో ఉందన్న ఉపరాష్ట్రపతి, మన పెద్దలు మన సంప్రదాయాల్లో, ఆరాధనలో ప్రకృతికి ప్రాధాన్యమిచ్చినట్లు తెలిపారు. పర్యావరణ హితంలోనే సమగ్రమైన అభివృద్ధి ఉందని, పాఠశాల స్థాయి నుంచే ప్రకృతికి మేలు చేసే విధంగా, మానవ పురోభివృద్ధికి సహకరించే విధంగా స్థిరమైన అభివృద్ధి భావనను ప్రోత్సహించాలని పేర్కొన్నారు.

విధాన నిర్ణేతలు మరియు ప్రణాళికలకు రూపకల్పన చేసే వారు గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల అభివృద్ధిని ఈ ప్రక్రియలో అంతర్భాగం చేయాలని తెలిపారు. పేదరిక నిర్మూలనలో భాగంగా, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం, రైతుల ఆదాయాన్ని మెరుగు పరడం, గ్రామాలు పట్టణాల మధ్య అంతరాన్ని తొలగించడం, వాతావరణ మార్పుల వల్ల ఎదురౌతున్న సమస్యలను పరిష్కరించడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని నియంత్రణలో ఉంచడం, మహిళా సాధికారతను సాకారం చేయడం, స్థిరమైన వృద్ధి దిశగా పయనించే ఉద్యోగాల కల్పన లాంటి అంశాల మీద దృష్టి నిలిపి ముందుకు సాగాలని ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు.
First published: February 9, 2019, 1:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading