నిజామాబాద్‌లో కవిత పోటీ వెనుక లెక్క.. బయటపెట్టిన ప్రశాంత్ రెడ్డి

Kalvakuntla Kavitha | టీఆర్‌ఎస్‌కు దాదాపు 90శాతం ఓట్లు పడినా ఆశ్చర్యపోనవసరం లేదని ప్రశాంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

news18-telugu
Updated: March 19, 2020, 9:52 PM IST
నిజామాబాద్‌లో కవిత పోటీ వెనుక లెక్క.. బయటపెట్టిన ప్రశాంత్ రెడ్డి
నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కల్వకుంట్ల కవిత
  • Share this:
నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అఖండ మెజార్టీతో విజయం సాధిస్తారని రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 824 మంది ఓటర్లుగా ప్రజాప్రతినిధులు ఉన్నారని, ఇందులో టీఆర్‌ఎస్ సంఖ్యా బలం 504 ఉండగా.. ఎంఐఎంకు చెందిన 28 మంది ఓటర్లు టీఆర్‌ఎస్‌కే మద్దతు పలుకుతారని, 66 మంది స్వతంత్ర ఓటర్లు కూడా కవిత గెలుపు కోసం టీఆర్‌ఎస్‌కే ఓటు వేసేందుకు సంసిద్ధంగా ఉన్నామని ఇది వరకే ప్రకటించారని ఆయన తెలిపారు. దీంతో టీఆర్‌ఎస్ సంఖ్యా బలం 598కి చేరిందని మంత్రి పేర్కొన్నారు.

141 సంఖ్యాబలం ఉన్న కాంగ్రెస్ 598 మంది ప్రజాప్రతినిధుల బలం ఉన్న టీఆరెస్ తో పోటీ ఎలా ఇస్తుంది? 85 మంది ఓటర్ల బలమున్న బీజీపీ 598 సంఖ్యాబలం ఉన్న టీఆరెస్ తో పోటీ చేసి నిలిచి గెలుస్తుందా?అని మంత్రి ప్రతి పక్షాలను ప్రశ్నించారు. ఇది వరకే ఒకసారి జరిగిన ఏమరుపాటు తో అభివృద్ధి మీద తీవ్ర ప్రభావం పడిందని గుర్తించిన స్థానిక ప్రజాప్రతినిధులంతా కవిత గెలుపును పార్టీలకు అతీతంగా కోరుకుంటున్నారని మంత్రి తెలిపారు.

నిజామాబాద్,కామారెడ్డి జిల్లాల అభివృద్ధిలో కవిత కీలక భూమిక పోషించనున్నారని అందరికీ ఆపార విశ్వాసం ఉన్న నేపథ్యంలో పార్టీలకు అతీతంగా ఏకపక్ష ఓటింగ్ జరిగే అవకాశం ఉందన్నారు. దీంతో టీఆర్‌ఎస్‌కు దాదాపు 90శాతం ఓట్లు పడ్డ ఆశ్చర్యపోనవసరం లేదని ధీమా వ్యక్తం చేశారు. కవిత గెలుపుకోసం స్వచ్చందంగా అనేకమంది వివిధ పార్టీల నుంచి వచ్చి టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకుంటున్నారని ఆయన అన్నారు.
First published: March 19, 2020, 9:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading