ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కాన్వాయ్‌కి ప్రమాదం.. వాహనం బోల్తా

శరద్ పవార్‌ కాన్వాయ్‌లోని ఓ వాహనం బోల్తా పడింది. ముంబై- పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై పుణెలోని ఖండాలా వద్ద సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది.

news18-telugu
Updated: June 29, 2020, 3:04 PM IST
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కాన్వాయ్‌కి ప్రమాదం.. వాహనం బోల్తా
శరద్ పవార్ కాన్వాయ్‌లో వాహనాలు బోల్తా
  • Share this:
NCP (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ) నేత శరద్ పవార్‌కు త‌ృటిలో రోడ్డు ప్రమాదం తప్పింది. శరద్ పవార్‌ కాన్వాయ్‌లోని ఓ వాహనం బోల్తా పడింది. ముంబై- పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై పుణెలోని ఖండాలా వద్ద సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. శరద్ పవార్ కాన్వాయ్‌లోని పోలీస్ జీపు అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. ఐతే అప్పటికే శరద్ పవార్ ప్రయాణిస్తున్న కారు వెళ్లిపోవడంతో ఆయనకు ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో జీపు డ్రైవర్‌కు గాయాలయ్యాయని పుణె రూరల్ పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటాన స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


కాగా, ఇవాళ పుణె-ముంబై ఎక్స్‌ప్రెస్ హైవేపై మరో ప్రమాదం జరిగింది. రాయ్‌గఢ్ జిల్లా ఖపోలి వద్ద ఓ కంటైనర్ బీభత్సం సృష్టించింది. అతివేగంతో అదుపుతప్పి ముందు వెళ్తున్న మూడు వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోగా... మరో నలుగురు గాయపడ్డారు.
First published: June 29, 2020, 3:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading