కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలపై సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు

దేశంలో ప్రస్తుత వాతావరణాన్ని ఎదుర్కొనే పరిస్థితుల్లో కాంగ్రెస్‌ లేదని వీరప్పమొయిలీ స్పస్టం చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్‌ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే పరిస్థితిలో పార్టీ లేదన్నది వాస్తవమని ఆయన అన్నారు.

news18-telugu
Updated: August 26, 2020, 7:32 AM IST
కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలపై సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు
దేశంలో ప్రస్తుత వాతావరణాన్ని ఎదుర్కొనే పరిస్థితుల్లో కాంగ్రెస్‌ లేదని వీరప్పమొయిలీ స్పస్టం చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్‌ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే పరిస్థితిలో పార్టీ లేదన్నది వాస్తవమని ఆయన అన్నారు.
  • Share this:
సీడబ్ల్యూసీ సమావేశం వేదికగా కాంగ్రెస్‌లో నెలకొన్న రచ్చ ఇప్పట్లో చల్లారే పరిస్థితి కనిపించడం లేదు. బీజేపీతో సీనియర్లు కుమ్మక్కయ్యారన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై చాలా మంది సీనియర్లు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఐతే అదే రోజు పరిస్థితులు చక్కదిద్దేందుకు రణ్‌దీప్ సూర్జేవాలతో పాటు కొందరు నేతలు ప్రయత్నించారు. అందులో భాగంగానే రాహుల్ గాంధీ అలాంటి వ్యాఖ్యలు చేయలేదని.. తాము కూడా తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నామని నేతలు ప్రకటించారు. కానీ ఇప్పటికీ పలువురు సీనియర్లు పార్టీ తీరుపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీరప్ప మొయిలీ చేసిన తాజా వ్యాఖ్యలు దీనికి మరింత బలం చేకూర్చుతున్నాయి.

గతంలో తాము రాసిన లేఖపై సోనియా గాంధీకి వివరణ ఇస్తూనే నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు కొందరు సీనియర్లు. రాజకీయ సవాళ్లను ఎదుర్కోవటానికి పార్టీకి ప్రస్తుతమున్న సన్నద్ధత సరిపోదని.. పార్టీని బలోపేతం చేయాలన్న సదుద్దేశంతోనే లేఖ రాశామని చెప్పుకొచ్చారు. దేశంలో ప్రస్తుత వాతావరణాన్ని ఎదుర్కొనే పరిస్థితుల్లో కాంగ్రెస్‌ లేదని వీరప్పమొయిలీ స్పస్టం చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్‌ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే పరిస్థితిలో పార్టీ లేదన్నది వాస్తవమని ఆయన అన్నారు. ఐనప్పటికీ తమ లేఖ సోనియా గాంధీ మనసును నొప్పించి ఉంటే క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు. 2024లో జరిగే లోక్‌సభ, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సిద్ధంచేయాలన్నదే తమ లేఖ ఉద్దేశమని వివరించారు.

ఇక మరో సీనియర్ నేత ఆనంద్ శర్మ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాము పార్టీ పునరుజ్జీవాన్ని కోరుకుంటున్నామని... పార్టీ నాయకత్వాన్ని సవాల్ చేయడం లేదని వివేక్ టంకా చేసిన ట్వీట్‌ను ఆయన అభినందించారు. లేఖపై సంతకాలు చేసిన 23 మందిలో ఎవరికీ పార్టీని వీడే ఉద్దేశమే లేదని నేతలు తెలిపారు. బీజేపీలో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఐతే అధిష్ఠానానికి రాసిన లేఖ లీక్‌ కావటంపై సమగ్ర విచారణ జరగాలని అన్నారు. అందుకు కారకులైన వారిని శిక్షించాలని కోరారు. సోనియా, రాహుల్ గాంధీని సవాల్ చేసే ఉద్దేశమే లేదని చెబుతున్నప్పటికీ.. పార్టీ తీరుపై మాత్రం నేతలు అసంతృప్తితోనే ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: August 26, 2020, 7:29 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading