BJP: బీజేపీలో చిచ్చుపెట్టిన లఖీంపూర్ ఘటన.. వరుణ్ గాంధీ, మేనకకు హైకమాండ్ షాక్

వరుణ్ గాంధీ, మేనకా గాంధీ

బీజేపీ ప్రకటించిన జాతీయ కార్యవర్గంలో.. 80 మంది రెగ్యులర్ సభ్యులతో పాటు 50 మంది ప్రత్యేక ఆహ్వానితులు, మరో 179 మంది శాశ్వత ఆహ్వానితులు ఉన్నారు. ఇందులో ఏ జాబితాలోనూ వరుణ్ గాంధీ, మేనకాగాంధీకి చోటు దక్కలేదు.

 • Share this:
  లఖీంపూర్ ఖేరి (Lakhimpur Kheri) ఘటనపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. కేంద్రమంత్రి తనయుడు కారు ఢీకొని రైతులు మరణించారని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తే కారుతో ఢీకొట్టి చంపేస్తారా? అని విపక్షాలు మండిపతున్నాయి. ఐతే విపక్షాల ఆరోపణలను కేంద్రమంత్రి అజయ్ మిశ్రా (Ajay Mishra) కొట్టిపారేస్తున్నారు. ఘటన సమయంలో కారులో తన కుమారుడు లేడని.. ఆందోళన కారులు రాళ్లు రువ్వడంతోనే కారు అదుపుతప్పి బోల్తాపడిందని, దానికి కింద పడి రైతులు మరణించారని చెబుతున్నారు.  ఈ ఘటన బీజేపీలోనూ చిచ్చుపెట్టింది. సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరు నేతలు కామెంట్స్ చేస్తున్నారు.

  ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ బీజేపీ వరుణ్ గాంధీ (Varun Gandhi) ట్వీట్ చేశారు.  ఈ ఘటన విషయంలో యోగీ ఆదిత్యనాథ్ (Yogi Adityanath) నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం జవాబుదారీతనం ప్రదర్శించాలని పేర్కొన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ ట్వీట్ చేసిన కొన్ని గంటల్లోనే బీజేపీ హైకమాండ్ వారికి బిగ్ షాక్ ఇచ్చింది.

  CBN Kuppam Tour: చంద్రబాబు కుప్పం టూర్ వెనుక కారణం ఇదేనా..? తమ్ముళ్లు దారికొస్తారా..?

  బీజేపీ గురువారం ప్రకటించిన జాతీయ కార్యవర్గంలో వరుణ్ గాంధీ, ఆయన తల్లి మేనకా గాంధీకి చోటు దక్కలేదు.  80 మందితో కూడిన బీజేపీ జాతీయ కార్యవర్గంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ సీనియర్లు ఉన్నారు.  బీజేపీ సీనియర్ నేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషీలకు కూడా ఇందులో చోటు కల్పించారు. ఇటీవల జరిగిన కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణలో  పదవులు కోల్పోయిన రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్, హర్షవర్ధన్ వంటి నేతలకు కూడా కార్యవర్గంలో చోటు కల్పించారు. కానీ ఇప్పటికే జాతీయ వర్గ సభ్యులుగా ఉన్న తల్లీకొడుకులు మేనకా గాంధీ, వరుణ్ గాంధీని మాత్రం తప్పించారు.

  MLA Roja: నగరిలో రోజాకు తప్పని తలనొప్పులు... సొంత నియోజకవర్గంలో  మాట నెగ్గకపోతే ఎలా?

  బీజేపీ ప్రకటించిన జాతీయ కార్యవర్గంలో.. 80 మంది రెగ్యులర్ సభ్యులతో పాటు 50 మంది ప్రత్యేక ఆహ్వానితులు, మరో 179 మంది శాశ్వత ఆహ్వానితులు ఉన్నారు. ఇందులో ఏ జాబితాలోనూ వరుణ్ గాంధీ, మేనకాగాంధీకి చోటు దక్కలేదు.  ఇప్పటికే బీజేపీ హైకమాండ్‌పై వరుణ్ గాంధీ అంసతృప్తిగా ఉన్నారు. తనకు మంత్రి పదవి ఇవ్వలేదని బీజేపీతో అంటీముట్టనట్టుగా ఉంటున్నారు.  ఈ క్రమంలోనే లఖీంపూర్ ఘటనపై కామెంట్స్ చేయడం.. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే వారిని బీజేపీ కార్యవర్గం నుంచి తప్పించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయింది.

  Revanth Reddy: హుజురాబాద్‌లో రేవంత్ రెడ్డి ఎదుర్కోబోయే అసలు సిసలు పరీక్ష ఇదే..!

  అక్టోబరు 3న లఖీంపూర్ ఖేరీలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు చేశారు. మంత్రులను ఆందోళనకారులు అడ్డుకోవడంతో హింస చెలరేగింది. ఆ ఘటనలో నలుగురు రైతులు, ముగ్గురు బీజేపీ కార్యకర్తలు సహా మొత్తం ఎనిమిది మంది మరణించారు. కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కారు కింద పడి రైతులు నలిగిపోయారని, ఉద్దేశపూర్వగానే రైతులను ఢీకొట్టి చంపేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మృతుల్లో ముగ్గురు బీజేపీ కార్యకర్తలు ఉన్నారని, ఆందోళనకారులు కొట్టి చంపేశారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తామని, అన్ని కోణాలనూ వెలికితీసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇది వరకే ప్రకటించారు.
  Published by:Shiva Kumar Addula
  First published: