వంగవీటి రాధా మళ్లీ డైలమాలో పడిపోయారా ?

Vangaveeti Radha | రంగా జయంతి సందర్భంగా ఈ అంశంపై రాధా ఓ క్లారిటీ ఇస్తారని ఆయన అభిమానులు భావించారు. కానీ ఆయన మాత్రం జనసేనలో చేరే అంశంపై ఇప్పుడే నిర్ణయం తీసుకోవడం సరికాదనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఇప్పటికే మూడుసార్లు పార్టీ మారిన వంగవీటి రాధా... ఈ సారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశం ఆసక్తికరంగా మారింది.

news18-telugu
Updated: July 4, 2019, 12:42 PM IST
వంగవీటి రాధా మళ్లీ డైలమాలో పడిపోయారా ?
వంగవీటి రాధాకృష్ణ( Facebook Image)
  • Share this:
వంగవీటి రంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా రాజకీయ పయనం ఎటు వైపు సాగుతుందనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. రంగా 72వ జయంతి సందర్భంగా రాధా నుంచి ఈ విషయంపై ఓ క్లారిటీ వస్తుందని రంగా, రాధా అభిమానులు ఎదురుచూశారు. కానీ ఆయన మాత్రం తన పొలిటికల్ ఫ్యూచర్ ఏంటనే దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో వంగవీటి రాధా రెండు దఫాలుగా చర్చలు జరపడంతో... ఆయన మరోసారి పార్టీ మారడం ఖాయమని అంతా భావించారు. కానీ రాధా మాత్రం ఈ సారి తొందరపడొద్దని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఎన్నికలకు ముందు వైసీపీని వీడి టీడీపీలో చేరిన వంగవీటి రాధాకు... గత ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభించలేదు. నిజానికి ఎన్నికలకు ముందు వైసీపీకి రాజీనామా చేసిన రాధా... టీడీపీలో చేరే విషయంలో అంత తొందరగా నిర్ణయం తీసుకోలేదనే చెప్పాలి. కొన్ని వారాల పాటు తన నిర్ణయాన్ని ప్రకటించకుండా ఉండిపోయిన రాధా... ఎట్టకేలకు టీడీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. అయితే చివరి నిమిషంలో టీడీపీలో చేరిన రాధాకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాలేదు. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రాధాకు సుముచిత పదవి ఇస్తామని అప్పట్లో చంద్రబాబు హామీ ఇచ్చారు.

అయితే ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓటమి పాలవ్వడంతో... వంగవీటి రాధా కూడా పార్టీలో కొనసాగడంపై డైలామాలో పడిపోయారు. ఇదే సమయంలో కొద్ది రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో రాధా రెండుసార్లు చర్చల జరిపారు. దీంతో ఆయన జనసేనలో చేరడం ఖాయమని అంతా భావించారు. కానీ రాధా మాత్రం జనసేనలో చేరే అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.
Published by: Kishore Akkaladevi
First published: July 4, 2019, 12:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading