Home /News /politics /

VANGAVEETI RADHAKRISHNA POLITICS CREATING CONFUSION IN ANDHRA PRADEH POLITICS HERE IS THE DETAILS AK

Vijayawada: అసలు Vangaveeti Radha లెక్కేంటి ?.. కన్ఫ్యూజ్ అవుతున్నారా ? కన్ఫ్యూజ్ చేస్తున్నారా ?

వంగవీటి రాధాకృష్ణ (ఫైల్ ఫోటో)

వంగవీటి రాధాకృష్ణ (ఫైల్ ఫోటో)

Vijayawada: రాజకీయాల్లో వ్యూహాత్మకంగా అడుగులు వేయడంలో ఎప్పుడూ పెద్దగా సక్సెస్ కాని వంగవీటి రాధా.. ఈసారి ఇతరులను కన్ఫ్యూజ్ చేస్తున్నారో లేక తనకు తానే కన్ప్యూజ్ అవుతున్నారో తెలియడం లేదనే వాదనలు జోరందుకున్నాయి.

    రాజకీయాల్లో రాణించడం అంత తేలిక కాదు. ఈ విషయం తెలియడానికి దివంగత కాపు నాయకుడు వంగవీటి రంగా తనయుడు రాధాకు చాలా కాలమే పట్టింది. అప్పట్లో దివంగత సీఎం వైఎస్ఆర్ హయాంలో ఎమ్మెల్యేగా విజయం సాధించిన రాధా.. ఆ తరువాత చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ పార్టీ కాంగ్రెస్‌లో విలీనమైన తరువాత వంగవీటి రాధా వైఎస్ జగన్ స్థాపించిన వైసీపీలో చేరారు. అయితే తాను కోరిన ఎమ్మెల్యే సీటు ఇచ్చే విషయంలో వైసీపీ నాయకత్వం సముఖత వ్యక్తం చేయడంతో.. గత ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి ఎవరూ ఊహించని విధంగా టీడీపీలో చేరారు. అయితే టీడీపీలోనూ తాను ఆశించిన స్థానం నుంచి పోటీ చేసే అవకాశం రాకపోవడంతో కేవలం ఎన్నికల ప్రచారానికి మాత్రమే పరిమితమయ్యారు.

    అయితే మధ్యలో వంగవీటి రాధా టీడీపీకి కూడా దూరంగా ఉండటంతో.. ఆయన పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేనలోకి వెళతారనే వార్తలు వచ్చాయి. అయితే కొన్నేళ్ల వ్యవధిలోనే పలు పార్టీలు మారడంతో రాజకీయంగా ఇబ్బందులు వస్తున్నాయని గమనించిన వంగవీటి రాధా.. ఇకపై పార్టీలు మారే పద్ధతికి ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకుంటున్నట్టు ప్రచారం జరిగింది. దీంతో రాధా టీడీపీలోనే కొనసాగడం ఖాయమని అంతా అనుకున్నారు. అయితే ఇటీవల రాధా తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని అనడం.. ఆ వెంటనే వైసీపీ సర్కార్ ఆయనకు భద్రత కల్పించేందుకు ముందుకు రావడంతో... ఆయన పార్టీ మార్పు అంశం మరోసారి తెరపైకి వచ్చింది.

    రాధా విషయంలో వైసీపీ అంత సుముఖంగా ఉండటానికి అసలు కారణం ఆయన పార్టీ మారేందుకు సిద్ధపడటమే అనే వాదనలు వినిపించాయి. వంగవీటి రాధా స్నేహితులైన మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాధాను వైసీపీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని.. అవి ఫలించే అవకాశం ఉందని ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే రాధా మాత్రం ఈ విషయంలో ఎటూ తేల్చకుండా సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. అయితే వంగవీటి రాధా ఉన్నట్టుండి తన హత్యకు కుట్ర జరుగుతోందని అనడం.. ఆ తరువాత బెజవాడ రాజకీయాల్లో మళ్లీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారడం వెనుక అసలు కారణం ఏంటనే విషయం ఎవరికీ అర్థంకావడం లేదు.

    Nara Lokesh: నారా లోకేశ్ కోసం ఆ టీడీపీ నేత వేరే జిల్లాకు వెళ్లిపోతున్నారా ?

    MLA Roja: రోజా ఒకటనుకుంటే మరొకటి జరుగుతోందా ?.. భారమంతా ఆయన మీదే..

    అయితే వంగవీటి రాధా మరోసారి రాజకీయాల్లో కన్ఫ్యూజ్ అవుతున్నారేమో అనే చర్చ కూడా సాగుతోంది. రాజకీయాల్లో వ్యూహాత్మకంగా అడుగులు వేయడంలో ఎప్పుడూ పెద్దగా సక్సెస్ కాని వంగవీటి రాధా.. ఈసారి ఇతరులను కన్ఫ్యూజ్ చేస్తున్నారో లేక తనకు తానే కన్ప్యూజ్ అవుతున్నారో తెలియడం లేదనే వాదనలు జోరందుకున్నాయి. తాను ప్రస్తుతం ఉన్న టీడీపీలో ప్రాధాన్యత కోసం రాధా ఇలా చేశారా లేక తాను వెళ్లాలని అనుకుంటున్న వైసీపీలో ప్రాధాన్యత దక్కేందుకు ఇలా చేస్తున్నారా ? అన్నది తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Vangaveeti Radha

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు