Home /News /politics /

VANGAVEETI RADHAKRISHNA MEETS TDP LEADER PATTABHI SEND SIGNALS THAT HE MAY NOT LEAVE TELUGU DESAM PARTY AK

Andhra Pradesh: టీడీపీకి బిగ్ రిలీఫ్ ఇచ్చిన విజయవాడ నేత.. ఆ విషయంలో క్లారిటీ ?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Andhra Pradesh: టీడీపీ నేత పట్టాభి ఇంటికి వెళ్లిన వంగవీటి రాధా ఆయనను పరామర్శించారు. అధికార పార్టీ నాయకులు దౌర్జన్యంగా దాడులు చేస్తుంటే పోలీసులు ఏం చేయలేని స్థితిలో ఉన్నారని విమర్శించారు.

    ఏపీలో తమ పార్టీ నేత పట్టాభి ఇల్లు, పార్టీ కార్యాలయాలపై వైసీపీ నేతలు దాడి చేయడాన్ని టీడీపీ నాయకత్వం సీరియస్‌గా తీసుకుంది. అధికార వైసీపీపై మాటల దాడి ముమ్మరం చేసింది. ఈ ఘటనలపై కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతోంది. వైసీపీపై రాజకీయ పోరాటానికి ఈ దాడులను వినియోగించుకోవాలని టీడీపీ గట్టిగా నిర్ణయించుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. టీడీపీ నేతలందరూ ఈ విషయంలో వైసీపీకి కౌంటర్ ఇవ్వాలని ఆ పార్టీ నాయకత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ దాడి తరువాత టీడీపీకి ఓ విషయంలో మాత్రం ఫుల్ క్లారిటీ వచ్చిందని.. ఒక రకంగా పార్టీకి ఊరట లభించిందని చర్చ జరుగుతోంది. పార్టీకి ఆ రకమైన ఊరట కలిగించేలా చేసిన నేత మరెవరో కాదు.. విజయవాడకు చెందిన మాజీ ఎమ్మెల్యే, కాపు వర్గానికి చెందిన కీలక నేత, దివంగత వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధా.

    వైసీపీ శ్రేణులు దాడి చేసిన పట్టాభిని పరామర్శించేందుకు పలువురు నేతలు ఆయన ఇంటికి వెళ్లారు. ఇందులో భాగంగా టీడీపీ నేత వంగవీటి రాధ పట్టాభి ఇంటికి స్వయంగా వెళ్లారు. దాడి విషయాలను అడిగి తెలుసుకున్నారు. పట్టాభిపై టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడులను ఆయన వ్యతిరేకించారు. ప్రభుత్వం అరాచకాలు ఎక్కువయ్యాయని ఇకనైనా మానుకోకపోతే పతనం తప్పదన్నారు. మహిళలలు చిన్నపిల్లలు అని చూడకుండా పట్టాభి ఇంట్లోకి చొరబడడం హేయమైన చర్యగా రాధా అభివర్ణించారు.

    Vangaveeti Radhakrishna news, Vangaveeti Radhakrishna election campaign, Vangaveeti Radhakrishna latest news, Vangaveeti Radhakrishna tdp, Vangaveeti Radhakrishna janasena, Vangaveeti Radhakrishna Vijayawada, వంగవీటి రాధా న్యూస్, వంగవీటి రాధా ఎన్నికల ప్రచారం, వంగవీటి రాధా టీడీపీ, వంగవీటి రాధా జనసేన
    వంగవీటి రాధాకృష్ణ (ఫైల్ ఫోటో)


    వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ నాయకులే లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారని ఈ అరాచకం ఎంతో కాలం కొనసాగదని అన్నారు. ఇక అధికార పార్టీ నాయకులు దౌర్జన్యంగా దాడులు చేస్తుంటే పోలీసులు ఏం చేయలేని స్థితిలో ఉన్నారని విమర్శించారు. పోలీసులను అడ్డుగా పెట్టుకొని వైసీపీ ప్రభుత్వం అరాచకం సృష్టిస్తోందన్నారు. ఈ దాడులకు త్వరలోనే ముగింపు పలకాలని ఆ సమయం దగ్గర్లోనే ఉందని అన్నారు.

    Revanth Reddy: ఆ సీనియర్ నేతతో టీఆర్ఎస్, బీజేపీలకు చెక్.. రేవంత్ రెడ్డి ప్లాన్ ?

    Avoid Diabetes: డయాబెటిస్ రావొద్దని కోరుకుంటున్నారా ? అయితే ఈ 5 సూత్రాలు పాటించండి..

    కొద్దిరోజుల కిందట ఆయన మంత్రి కొడాలి నానిని అనుకోకుండా కలిశారు. దీంతో ఆయన వైపీపీలో చేరుతారంటూ ప్రచారం సాగిన సమయంలో తాజాగా ఆయన పట్టాభిని పరామర్శించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నిజంగా టీడీపీని వీడే ఆలోచన ఉంటే వంగవీటి రాధా పట్టాభిని పరామర్శించేందుకు వచ్చేవారు కాదని.. ఆయనకు టీడీపీని వీడే ఆలోచన లేదు కాబట్టే పట్టాభిని కలిశారని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి తాజా ఘటన నేపథ్యంలో వంగవీటి విషయంలో టీడీపీకి ఓ క్లారిటీ రావడంతో పాటు ఊరట కూడా లభించినట్టు కనిపిస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Tdp, Vangaveeti Radha

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు