టీడీపీలో చేరనున్న వంగవీటి రాధా... ఎంపీగా పోటీ ?

సోమవారం అర్థరాత్రి మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌తో కలిసి ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమైన వంగవీటి రాధ... ఆయనతో పలు అంశాలపై చర్చించినట్టు టాక్ వినిపిస్తోంది. ఆయనకు మచిలీపట్నం ఎంపీ సీటు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: March 12, 2019, 7:24 AM IST
టీడీపీలో చేరనున్న వంగవీటి రాధా... ఎంపీగా పోటీ ?
వంగవీటి రాధాకృష్ణ( Facebook Image)
  • Share this:
వైసీపీకి గుడ్‌బై చెప్పిన తరువాత టీడీపీలో చేరే విషయంలో ఆలోచనలో పడ్డ మాజీ ఎమ్మెల్యే, వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధా... నేడు అధికారికంగా టీడీపీ కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తోంది. సోమవారం అర్థరాత్రి మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌తో కలిసి ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమైన వంగవీటి రాధ... ఆయనతో పలు అంశాలపై చర్చించినట్టు టాక్ వినిపిస్తోంది. విజయవాడలోని పేదల ఇళ్ల పట్టాలకు సంబంధించి వారి మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం. ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించడంతో... నేడు మరోసారి చంద్రబాబును కలిసి అధికారికంగా టీడీపీలో చేరాలని వంగవీటి రాధాకృష్ణ నిర్ణయించుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

మచిలీపట్నం ఎంపీగా పోటీ ?
మరోవైపు తనకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తేనే టీడీపీలో చేరతానని వంగవీటి రాధా పెట్టిన ప్రతిపాదనపై తీవ్ర కసరత్తు చేసిన టీడీపీ... ఆయనకు మచిలీపట్నం ఎంపీ సీటు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. విజయవాడలో ఎమ్మెల్యే సీట్లకు అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేసిన నేపథ్యంలో... ఆయనను మచిలీపట్నం ఎంపీగా బరిలోకి దింపాలని టీడీపీ భావిస్తోంది. ప్రస్తుతం మచిలీపట్నం ఎంపీగా ఉన్న టీడీపీ నేత కొనకళ్ల నారాయణను ఎమ్మెల్యే పోటీ చేయించి... రాధాను ఎంపీగా బరిలోకి దింపాలని చంద్రబాబు డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఇందుకు రాధా కూడా అంగీకరించినట్టు ప్రచారం జరుగుతోంది.First published: March 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>