వంగవీటి రాధా యూటర్న్... కారణం ఆ ఇద్దరే ?

టీడీపీని వీడాలని ఎన్నికల తరువాత నిర్ణయించుకున్న వంగవీటి రాధా... జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో రెండుసార్లు సమావేశమయ్యారు. దీంతో ఆయన జనసేనలోకి వెళ్లడం దాదాపు ఖాయమనే ప్రచారం జరిగింది.

news18-telugu
Updated: November 25, 2019, 3:31 PM IST
వంగవీటి రాధా యూటర్న్... కారణం ఆ ఇద్దరే ?
వంగవీటి రాధాకృష్ణ( Facebook Image)
  • Share this:
వంగవీటి రంగా వారసుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ పొలిటికల్ కెరీర్ ప్రస్తుతం డైలమాలో ఉంది. ఎన్నికలకు ముందు వైసీపీని వీడి టీడీపీలో చేరిన వంగవీటి రాధాకు... ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాలేదు. అయితే టీడీపీ గెలుపు కోసం ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు రాధా. అయితే ఎన్నికల్లో టీడీపీ ఓటమి చెందడంతో... రాజకీయంగా ఆయన పూర్తిగా సైలెంట్ అయ్యారు. టీడీపీని వీడాలని ఎన్నికల తరువాత నిర్ణయించుకున్న వంగవీటి రాధా... జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో రెండుసార్లు సమావేశమయ్యారు. దీంతో ఆయన జనసేనలోకి వెళ్లడం దాదాపు ఖాయమనే ప్రచారం జరిగింది.

అయితే మరోసారి పార్టీ మార్పు నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం తీసుకోవాలని భావించిన రాధా... జనసేనలో చేరిక నిర్ణయాన్ని కొంతకాలం వాయిదా వేసుకోవాలని భావించారని విజయవాడ రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా వంగవీటి రాధాను మరోసారి వైసీపీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. వంగవీటి రాధాకు స్నేహితులైన ఏపీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ... రాధాను వైసీపీలోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

సీఎం జగన్‌ను ఒప్పించి రాధాను వైసీపీలోకి తీసుకురావడానికి ఈ ఇద్దరు ప్రయత్నాలు చేస్తున్నారనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఇలా చేయడం వల్ల ఆయన జనసేనలోకి వెళ్లకుండా అడ్డుకోవచ్చన్నది వైసీపీ వ్యూహమనే టాక్ కూడా వినిపిస్తోంది. మరి... ప్రస్తుతం పొలిటికల్‌గా సైలెంట్‌గా రాధా వైసీపీలోకి వెళతారా లేక జనసేనకు జై కొడతారా అన్నది వేచి చూడాలి.



First published: November 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>