నన్ను వెన్నుపోటు పొడవలేదా ? జగన్‌ మళ్లీ ప్రతిపక్షమే: వంగవీటి రాధాకృష్ణ

Vangaveeti Radha joins TDP | ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేయాలనే నినాదంతో ముందుకు వెళతామని వంగవీటి రాధాకృష్ణ అన్నారు. తనను తమ్ముడు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడవలేదా ? అని ప్రశ్నించారు.

news18-telugu
Updated: March 13, 2019, 9:55 PM IST
నన్ను వెన్నుపోటు పొడవలేదా ? జగన్‌ మళ్లీ ప్రతిపక్షమే: వంగవీటి రాధాకృష్ణ
వంగవీటి రాధాకృష్ణ( Facebook Image)
news18-telugu
Updated: March 13, 2019, 9:55 PM IST
వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదని మాజీ ఎమ్మెల్యే, వంగవీటి రంగా తనయుడు రాధాకృష్ణ అన్నారు. ఇక్కడ రాజ్యాలున్నాయని... వాటిని పాలించాలని జగన్ ఆరాటపడుతున్నారని రాధా విమర్శించారు. ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో వంగవీటి రాధాకృష్ణ, తన అనుచరులతో కలిసి టీడీపీ కండువా కప్పుకున్నారు. ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేయాలనే నినాదంతో ముందుకు వెళతామని రాధాకృష్ణ అన్నారు. తనను తమ్ముడు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడవలేదా ? అని ప్రశ్నించారు. అనేకమంది ఇతర నాయకులతో కలిసి ఏపీని ఇబ్బందిపెట్టాలని జగన్ చూస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా వైఎస్ జగన్ మారాలని వంగవీటి రాధా వ్యాఖ్యానించారు. మరోసారి ప్రతిపక్ష నేతగా ఏపీ ప్రజలు జగన్‌కు అవకాశం ఇస్తారని అన్నారు.

వంగవీటి రాధాను టీడీపీలోకి ఆహ్వానించిన చంద్రబాబు... చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా రాధాను కొనియాడారు. విజయవాడలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని వంగవీటి రాధా కోరారని అన్నారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో టీడీపీ చిత్తశుద్ధితో వ్యవహరించిందని చంద్రబాబు అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ కనుసన్నల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పని చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలవాల్సిన అవసరం ఎంతగానో ఉందని అన్నారు. వంగవీటి రాధాతో పాటు చీరాలకు చెందిన వైసీపీ నేత బాలాజీ కూడా టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో గంటా శ్రీనివాసరావు, కరణం బలరాం తదితరులు పాల్గొన్నారు.







First published: March 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...