వంగవీటికి రాధాకృష్ణకు షాక్... టీడీపీ తరపున ప్రచారాన్ని అడ్డుకున్న గ్రామస్థులు

టీడీపీ స్టార్ క్యాంపెయినర్ హోదాలో రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్న వంగవీటి రాధాకు మండపేటలో చేదు అనుభవం ఎదురైంది.

news18-telugu
Updated: April 5, 2019, 12:19 PM IST
వంగవీటికి రాధాకృష్ణకు షాక్... టీడీపీ తరపున ప్రచారాన్ని అడ్డుకున్న గ్రామస్థులు
వంగవీటి రాధాకృష్ణ( Facebook Image)
  • Share this:
ఎన్నికలు ముందుకు టీడీపీలో చేరిన వంగవీటి రంగా తనయుడు, విజయవాడ తూర్పు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణకు ప్రచారంలో ఊహించని షాక్ తగిలింది. టీడీపీ స్టార్ క్యాంపెయినర్ హోదాలో రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్న వంగవీటి రాధాకు ... కాపు సామాజికవర్గం ఓటర్లు అధికంగా ఉండే తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. మండపేట నియోజకవర్గం పరిధిలోని కేశవరంలో ప్రచారం చేద్దామని వెళ్లిన వంగవీటి రాధాకు నిరసనలు ఎదురయ్యాయి.

టీడీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు తరఫున ప్రచారం చేద్దామని మండపేట వచ్చిన వంగవీటి రాధాను స్థానికులు అడ్డుకున్నారు. రాధాకృష్ణ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. టీడీపీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన రంగా తనయుడు రాధా టీడీపీలో చేరడాన్ని నిరసిస్తూ కొందరు ఈ రకమైన నిరసనకు దిగారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేయాల్సి వచ్చింది. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో... అక్కడి నుంచి వెనుదిరిగిన వంగవీటి రాధా... రంగా మీద వారు చూపించిన అభిమానమే తనకు చాలు అని అన్నారు.
Published by: Kishore Akkaladevi
First published: April 5, 2019, 12:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading