ఆ విషయంలో క్లారిటీ ఇచ్చిన వంగవీటి రాధా

టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ వైసీపీలో చేరడంతో... మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వంశీకి మంచి స్నేహితుడైన రాధా కూడా మళ్లీ వైసీపీ గూటికి చేరతాడని ప్రచారం జరిగింది.

news18-telugu
Updated: January 14, 2020, 5:23 PM IST
ఆ విషయంలో క్లారిటీ ఇచ్చిన వంగవీటి రాధా
వంగవీటి రాధాకృష్ణ( Facebook Image)
  • Share this:
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీని వీడి టీడీపీలోకి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ... ఎన్నికల తరువాత టీడీపీకి కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. టీడీపీకి ఆయన అధికారికంగా గుడ్ బై చెప్పకపోయినప్పటికీ... వంగవీటి రాధా జనసేన వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల తరువాత రెండుసార్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో వంగవీటి రాధా సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన జనసేన కుండవా కప్పుకోవడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ ఆయన మాత్రం జనసేనలో చేరలేదు. అయితే టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ వైసీపీలో చేరడంతో... మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వంశీకి మంచి స్నేహితుడైన రాధా కూడా మళ్లీ వైసీపీ గూటికి చేరతాడని ప్రచారం జరిగింది.

మంత్రి కొడాలి నాని సైతం రాధా తిరిగి వైసీపీలోకి వస్తే స్వాగతిస్తామని... సీఎం జగన్‌తో ఈ మేరకు చర్చిస్తామని వ్యాఖ్యానించారు. దీంతో వంగవీటి రాధా మళ్లీ వైసీపీలోకి వెళతారా లేక జనసేన కండువా కప్పుకుంటారా అనే అంశం సస్పెన్స్‌గా కొనసాగుతూ వస్తోంది. దీనిపై ఇంతకాలం స్పందించని వంగవీటి రాధా... తాను వైసీపీకి వ్యతిరేకమే అని రాజధాని రైతులకు సంఘీభావం ప్రకటించడం ద్వారా పరోక్షంగా సంకేతాలు ఇచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి.

తుళ్లూరులో రైతులు, మహిళలు చేపట్టిన దీక్షకు సంఘీభావం తెలిపిన వంగవీటి రాధా... ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన జిల్లాను, రైతులను జగన్ రెడ్డి వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. మహిళలపై దాడులు చేయడం రాజన్న రాజ్యమా? అని ప్రశ్నించారు. అయితే కొద్దిరోజుల క్రితం రాధా టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి సంఘీభావం తెలిపారు. దీంతో ఆయన టీడీపీలోనే కొనసాగొచ్చనే ప్రచారం జరిగింది. తాజాగా ఆయన సీఎం జగన్‌ను జగన్ రెడ్డి అని అనడం చూసిన కొందరు... రాధా పవన్ కళ్యాణ్ బాటలో నడుస్తాడేమో అని చర్చించుకుంటున్నారు. మొత్తానికి వంగవీటి రాధా ఏ పార్టీలోకి వెళ్లినా... వైసీపీలోకి వెళ్లడం లేదనే విషయంలో మాత్రం క్లారిటీ వచ్చింది.
Published by: Kishore Akkaladevi
First published: January 14, 2020, 5:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading