టీడీపీలో చేరికపై వంగవీటి రాధా అధికారిక ప్రకటన..

Vangaveeti Radha Joining TDP : సోమవారం అర్థరాత్రి మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌తో కలిసి రాధా చంద్రబాబుతో భేటీ అయిన సంగతి తెలిసిందే. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ భేటీలో రాధా డిమాండ్లకు చంద్రబాబు ఒప్పుకోవడంతో టీడీపీలో ఆయన చేరికకు మార్గం సుగమం అయినట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: March 12, 2019, 9:26 PM IST
టీడీపీలో చేరికపై వంగవీటి రాధా అధికారిక ప్రకటన..
వంగవీటి రాధాకృష్ణ (File)
  • Share this:
వైసీపీతో తెగదెంపులు చేసుకుని బయటకొచ్చిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా.. టీడీపీలో చేరికను వాయిదా వేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీని వీడి బయటకొచ్చిన సందర్భంలోనే.. అధికార పార్టీపై పరోక్షంగా చేసిన అనుకూల వ్యాఖ్యలు ఆయన టీడీపీ గూటికి చేరబోతున్నారన్న సంకేతాలను పంపించాయి. అయితే రేపో మాపో టీడీపీలో రాధా చేరిక అంటూ సాగిన ఊహాగానాలు ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. అయితే ఎట్టకేలకు ఈ నాన్చుడు ధోరణిని పక్కనపెట్టి టీడీపీలో చేరేందుకు రాధా సన్నద్దమయ్యారు. ఈ మేరకు అధికారికంగా ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు.

రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి తోడుగా ఉండేందుకు నిర్ణయించుకున్నానని ప్రెస్ నోట్ ద్వారా రాధా వెల్లడించారు. నియంత్రుత్వ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి చేతుల్లోకి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు వెళ్లకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. విజయవాడ నగరంలో ప్రతీ సామాన్యుడికి ఇళ్ల పట్టాలు సాధించాలన్న తన తండ్రి ఆశయానికి అనుగుణంగా పనిచేస్తున్న సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. ఏపీలో ఎన్నికలను అభివృద్దికి-అరాచకానికి, అనుభవానికి-అహంకారానికి మధ్య సంగ్రామంగా అభివర్ణించారు.

మొత్తం మీద టీడీపీలో చేరికను అధికారికంగా వెల్లడించిన రాధా.. తేదీని మాత్రం పేర్కొనకపోవడం గమనార్హం. కాగా, సోమవారం అర్థరాత్రి మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌తో కలిసి రాధా చంద్రబాబుతో భేటీ అయిన సంగతి తెలిసిందే. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ భేటీలో రాధా డిమాండ్లకు చంద్రబాబు ఒప్పుకోవడంతో టీడీపీలో ఆయన చేరికకు మార్గం సుగమం అయినట్టు తెలుస్తోంది.

(వంగవీటి రాధా ప్రెస్‌ నోట్)
First published: March 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>