జనసేనలోకి వంగవీటి రాధా..? మంగళగిరిలో పవన్‌తో భేటీ..

నిజానికి ఎన్నికల సమయంలో టీడీపీని వీడినప్పుడే.. ఆయన తదుపరి అడుగు జనసేన వైపే ఉంటుందని అంతా భావించారు. కానీ కొద్దిరోజులు వేచి చూసిన రాధా.. ఆ తర్వాత టీడీపీలో చేరిపోయారు.

news18-telugu
Updated: June 24, 2019, 4:04 PM IST
జనసేనలోకి వంగవీటి రాధా..? మంగళగిరిలో పవన్‌తో భేటీ..
వంగవీటి రాధాకృష్ణ (File)
  • Share this:
సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల ముందు వైసీపీని వీడి టీడీపీలోకి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా.. ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నారు. సోమవారం ఉదయం మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌తో రాధా భేటీ అయ్యారు. దాదాపు గంట పాటు భేటీ అయిన వీరిద్దరు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించినట్టు సమాచారం. జనసేనలో చేరాలనుకుంటున్నట్టు రాధా తన అభీష్టాన్ని పవన్‌తో వ్యక్తం చేసినట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేపో.. మాపో.. ఆయన మళ్లీ పార్టీ మారుతారనే ప్రచారం ఊపందుకుంది.

నిజానికి ఎన్నికల సమయంలో టీడీపీని వీడినప్పుడే.. ఆయన తదుపరి అడుగు జనసేన వైపే ఉంటుందని అంతా భావించారు. కానీ కొద్దిరోజులు వేచి చూసిన రాధా.. ఆ తర్వాత టీడీపీలో చేరిపోయారు. విజయవాడలో ప్రతీ పేదవాడికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్న తన తండ్రి ఆశయానికి అనుగుణంగా పనిచేసే పార్టీతోనే తాను నడుస్తానని చెప్పి మరీ టీడీపీ కండువా కప్పుకున్నారు. ఎన్నికల్లో టీడీపీ తరుపున స్టార్ క్యాంపెయినర్‌గా పనిచేశారు. టీడీపీ దారుణ ఓటమితో ఇప్పుడా పార్టీలో కొనసాగడంపై పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. దీంతో జనసేనతో చేయి కలిపేందుకు ఆయన సిద్దమవుతున్నారన్న చర్చ జరుగుతోంది.
Published by: Srinivas Mittapalli
First published: June 24, 2019, 4:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading