జనసేనకు కొత్త జోష్.. త్వరలో వంగవీటి రాధా చేరిక?

వంగవీటి రాధా గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీని వీడి టీడీపీ వైపు చూశారు. ఎన్నికల్లో పోటీచేయలేదు. కానీ, టీడీపీ తరఫున ప్రచారం చేశారు.

news18-telugu
Updated: September 5, 2019, 11:02 PM IST
జనసేనకు కొత్త జోష్.. త్వరలో వంగవీటి రాధా చేరిక?
పవన్ కళ్యాణ్, వంగవీటి రాధా
  • Share this:
జనసేన పార్టీకి కొత్త జోష్ వచ్చేలా ఉంది. వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధా త్వరలో జనసేన పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లా దిండిలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను వంగవీటి రాధా కలవడం రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. వంగవీటి రాధా గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీని వీడి టీడీపీ వైపు చూశారు. ఎన్నికల్లో పోటీచేయలేదు. కానీ, టీడీపీ తరఫున ప్రచారం చేశారు. ఎన్నికల తర్వాత ఆయన చూపు జనసేన వైపు పడినట్టు తెలుస్తోంది. దిండిలోని రిసార్ట్స్‌లో జరుగుతున్న జనసేన సమావేశాలకు హాజరైన వంగవీటి రాధా పవన్ కళ్యాణ్‌ను కలిశారు. దీంతో ఆయన టీడీపీకి గుడ్ బై కొట్టి జనసేనలో చేరతారనే ప్రచారం మొదలైంది.

జనసేన మీద కాపు పార్టీ అనే ముద్ర ఉంది. ఇప్పుడు వంగవీటి రాధా కూడా చేరితే ఆ ముద్ర మరింత బలపడిపోయే అవకాశం ఉంది. వంగవీటి రాధా తండ్రి వంగవీటి రంగా కాంగ్రెస్ పార్టీలో ఉండగా, టీడీపీ ప్రభుత్వ హయాంలో హత్యకు గురయ్యారు. కాపు నేతగా వంగవీటి రంగాకు రాష్ట్రంలో పేరుంది. ఆ తర్వాత ఆయన రాజకీయ వారసత్వాన్ని అందుకున్న రాధా.. తన తండ్రిలా కాపు సామాజికవర్గానికి దగ్గర కాలేకపోయారనే వాదన ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో కాపు సామాజికవర్గం నిర్ణయాత్మకమైన ఓట్ బ్యాంక్ ఉంది. 2014 ఎన్నికల్లో టీడీపీ - బీజేపీ - జనసేన కలసి పోటీ చేయడంతో కాపులు పెద్ద ఎత్తున ఆ కూటమికి అండగా నిలిచారు. 2019 ఎన్నికల్లో ఎవరిదారి వారు చూసుకోవడంతో కాపుల్లోనూ చీలిక వచ్చింది. వైసీపీకి లాభించింది. అయితే, ఇప్పుడు రాధా చేరితే, జనసేన మీద కాపు పార్టీ ముద్ర మరింత బలంగా పడే అవకాశం ఉంది.

First published: September 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>