వంగవీటి రాధా దారెటు... పవన్ కళ్యాణ్ రాజకీయం మొదలుపెట్టారా ?

జనసేనలోకి వెళితే బాగుంటుందని అనుచరుల నుంచి వంగవీటి రాధాపై ఒత్తిడి పెరుగుతోందని... ఈ కారణంగానే ఆయన ఆ పార్టీ వైపు చూస్తున్నారని జిల్లా రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

news18-telugu
Updated: June 25, 2019, 12:53 PM IST
వంగవీటి రాధా దారెటు... పవన్ కళ్యాణ్ రాజకీయం మొదలుపెట్టారా ?
వంగవీటి రాధా, పవన్ కళ్యాణ్
  • Share this:
గత ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా పవన్ కళ్యాణ్‌తో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేయకున్నా... ఆ పార్టీ తరపున ప్రచారం మాత్రమే చేశారు వంగవీటి రాధా. అయితే ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం మూటగట్టుకోవడంతో ఆయన ఆలోచన మారినట్టు కనిపిస్తోంది. దీనికి తోడు క్షేత్రస్థాయి నుంచి జనసేనను బలోపేతం చేయాలని నిర్ణయించుకున్న పవన్ కళ్యాణ్... విజయవాడ నగరంలో పార్టీ బలోపేతం కోసం వంగవీటి రాధాను జనసేనలోకి ఆహ్వానించారని తెలుస్తోంది.

మరోవైపు జనసేనలోకి వెళితే బాగుంటుందని అనుచరుల నుంచి వంగవీటి రాధాపై ఒత్తిడి పెరుగుతోందని... ఈ కారణంగానే ఆయన ఆ పార్టీ వైపు చూస్తున్నారని జిల్లా రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వంగవీటి రాధా పార్టీలోకి వస్తే... పార్టీకి సంబంధించి జిల్లా సారథ్యం అందించేందుకు కూడా జనసేన సుముఖంగా ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఏపీలో బలపడేందుకు బీజేపీ వ్యూహారచన చేస్తున్న నేపథ్యంలో... వంగవీటి రాధా జనసేనలోకి వెళతారా లేక బీజేపీ వైపు చూస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది.

ఏపీలో ఇకపై తాను కూడా రాజకీయాలు చేస్తానని వ్యాఖ్యానించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్... వంగవీటి రాధాతోనే దాన్ని మొదలుపెట్టారేమో అనే చర్చ జరుగుతోంది. కాపులను ఎక్కువగా తన పార్టీలో చేర్చుకోవడం ద్వారా పార్టీపై కాపు ముద్ర పడుతుందని భావించిన పవన్ కళ్యాణ్... అదే జరిగితే తన పార్టీ కూడా చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరహాలోనే మారిపోతుందని అప్పట్లో భావించారు. కానీ ఎన్నికల్లో జనసేన ఘోర ఓటమి తరువాత పవన్ కళ్యాణ్ తీరులో మార్పు వచ్చిందని సమాచారం. కాపులను తన ఓటు బ్యాంకుగా మార్చుకోవడంతో పాటు ఇతర వర్గాలపై దృష్టి పెట్టాలని పవన్ భావిస్తున్నారని... ఈ కారణంగానే వంగవీటి రాధాను జనసేనలోకి ఆహ్వానించారనే వార్తలు వినిపిస్తున్నాయి.First published: June 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>