టీడీపీలోకి వంగవీటి... మరికాసేపట్లో చేరే అవకాశం

వంగవీటి చేరికను మాజీ ఎంపీ లగడపాటి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. తాజాగా వంగవీటి రాధాకృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.

news18-telugu
Updated: March 10, 2019, 12:16 PM IST
టీడీపీలోకి వంగవీటి... మరికాసేపట్లో చేరే అవకాశం
చంద్రబాబు, వంగవీటి రాధాక్రిష్ణ
  • Share this:
టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారు మాజీ వైసీపీ నేత వంగవీటి రాధాకృష్ణ. మరికాసేపట్లో ఆయన టీడీపీలో చేరబోతున్నారు. అయితే వంగవీటి చేరికను మాజీ ఎంపీ లగడపాటి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. తాజాగా వంగవీటి రాధాకృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను పార్టీ కార్యాలయానికి పంపారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కృష్ణా జిల్లాలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో అప్పట్లోనే వంగవీటి రాధ ఏ పార్టీలో చేరుతారోనని జోరుగా ప్రచారం జరిగింది. ముందుగా జనసేన పార్టీలో చేరుతారని వార్తలు వినిపించాయి. ఆ తర్వాత ఆయనను టీడీపీలోకి ఆహ్వానిస్తూ పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు వ్యాఖ్యలు కూడా చేశారు.
First published: March 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading