Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    వైసీపీకి వంగవీటి రాధాకృష్ణ రాజీనామా.. జగన్‌పై ఘాటు వ్యాఖ్యలు

    విజయవాడలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. వంగవీటి రంగా కుమారుడు, వంగవీటి రాధాకృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను పార్టీ కార్యాలయానికి పంపారు.

    news18-telugu
    Updated: January 20, 2019, 6:02 PM IST
    వైసీపీకి వంగవీటి రాధాకృష్ణ రాజీనామా.. జగన్‌పై ఘాటు వ్యాఖ్యలు
    వంగవీటి రాధాకృష్ణ (File)
    • Share this:
    విజయవాడలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. వంగవీటి రంగా కుమారుడు, వంగవీటి రాధాకృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను పార్టీ కార్యాలయానికి పంపారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కృష్ణా జిల్లాలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ కీలక నేత వంగవీటి రాధాకృష్ణ పార్టీకి రాజీనామా చేశారు. వంగవీటి రాధాకృష్ణ విజయవాడ సెంట్రల్ సీటును కోరుతుండగా, ఆ పార్టీ అధినేత జగన్ మాత్రం విజయవాడ తూర్పు నుంచి పోటీ చేయాలని సూచించారు. దీనిపై మనస్తాపం చెందిన రాధ గతంలో పార్టీ నుంచి బయటకు వెళ్లేందుకు సిద్ధంకాగా, విజయసాయిరెడ్డి సహా పలువురు వైసీపీ సీనియర్ నేతలు ఆయన్ను సముదాయించారు. తాజాగా ఈరోజు వైసీపీ కీలక నేత బొత్స సత్యనారాయణ వంగవీటి రాధాకృష్ణతో దాదాపు గంటకు పైగా చర్చించారు. పార్టీలోనే కొనసాగాలని సూచించారు. అయితే విజయవాడ సెంట్రల్ ఇస్తేనే పార్టీలో ఉంటానని వంగవీటి రాధాకృష్ణ స్పష్టం చేశారు. దీంతో బొత్స నిరాశగా వెనుదిరిగారు.

    వంగవీటి రాధా రాజీనామా లేఖ
    వంగవీటి రాధా రాజీనామా లేఖ


    పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వంగవీటి రాధా తన రాజీనామా లేఖను పంపించారు. ఆ లేఖలో ఆయన కొన్ని ఘాటు పదాలు కూడా వాడారు. తాను ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి వాడిని కాదని, పోరాటమే ఊపిరిగా తన ప్రయాణం కొనసాగిస్తానన్నారు. ‘ముఖ్యమంత్రి పదవి సాధించాలన్న మీ కాంక్ష నెరవేరాలంటే, పార్టీలో మీ అందరికీ ఆంక్షలు విధించడం మీకు తప్పనిసరి. నా ఆకాంక్ష నెరవేరాలంటే, ఆంక్షలు లేని ప్రజాప్రయాణం నాకు తప్పనిసరి.’ అని లేఖలో పేర్కొన్నారు.

    వంగవీటి రాధా రాజీనామా లేఖలో జగన్ మీద చేసిన కామెంట్స్


    వంగవీటి రాధా ఎక్కడికి వెళతారు? ఇప్పుడు ఇదే ప్రశ్న రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఆయన టీడీపీ వైపు అడుగులు వేస్తారా? లేకపోతే జనసేన వైపు నడుస్తారా? అనే సందేహాలు ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వం హయాంలోనే రంగా హత్య జరిగింది. దీంతో టీడీపీ మీద ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ టీడీపీలో చేరినా, ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావును తప్పించి వంగవీటి రాధాకు టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుందా? అనేది సందేహం.

    AP news, ap politics, janasena meetings, pawan kalyan slams tdp, జనసేన, పవన్ కల్యాణ్
    పవన్ కల్యాణ్, జనసేన చీఫ్


    వంగవీటి రాధా జనసేన పార్టీలో చేరతారా అనే చర్చ కూడా ఉంది. జనసేన పార్టీకి సంబంధించినంత వరకు విజయవాడలో పార్టీకి అభ్యర్థులను కూడా ఇంకా ఖరారు చేసుకోలేదు. ఇప్పుడే ఓ నిర్ణయం తీసుకుని జనసేనలో చేరితే, టికెట్ పరంగా కూడా ముందు అవకాశం దక్కే చాన్స్ ఉందని భావిస్తున్నారు.

    ఇవి కూడా చదవండి

    First published: January 20, 2019, 5:22 PM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading