రాజకీయాలకు వల్లభనేని వంశీ గుడ్ బై కొడుతున్నారా? కొన్ని రోజుల క్రితం వైసీపీలో చేరిన ఆయన ఇప్పుడు ఏకంగా రాజకీయాల నుంచే తప్పుకుంటున్నారా? వల్లభనేని వంశీ ఫేస్ బుక్లో చేసిన పోస్ట్ చూస్తే ఇలాంటి సందేహాలే వస్తున్నాయి ఆయన అభిమానులకు. ‘పద్నాలుగు సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో నా కష్టసుఖాలలో వెన్నంటి నిలిచిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు.’ అని వంశీ తన ఫేస్ బుక్ అకౌంట్లో పోస్ట్ చేశారు. టీడీపీలో రాజకీయ జీవితం ఆరంభించిన వల్లభనేని వంశీ గన్నవరం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో కూడా గన్నవరం నుంచి టీడీపీ తరఫున గెలిచిన ఆయన అనంతరం వైసీపీకి మద్దతు పలికారు. టీడీపీ నేత లోకేష్ మీద తీవ్రమైన విమర్శలు గుప్పించారు. వైసీపీలో అధికారికంగా చేరకపోయినప్పటికి జగన్కు మద్దతిస్తూ ముందుకు సాగుతున్నారు. గతంలో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన వల్లభనేని వంశీ ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఇప్పుడు మరోసారి ఇలాంటి ప్రకటన చేయడంతో వంశీ రాజకీయాల నుంచి విరమించుకుంటారనే చర్చ మళ్లీ మొదలైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Tdp, Vallabhaneni vamsi, Ysrcp