news18-telugu
Updated: October 31, 2019, 3:57 PM IST
చంద్రబాబు, వల్లభనేని వంశీ
తెలుగుదేశం పార్టీకి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మరో షాక్ ఇచ్చారు. వంశీతో టీడీపీ నేతల చర్చలు విఫలం అయ్యాయి. వంశీని బుజ్జగించాలంటూ చంద్రబాబునాయుడు.. ఎంపీ కేశినేని నాని, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణను రాయబారం పంపారు. అయితే, వంశీతో వారి చర్చలు సఫలం కాలేదు. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడానికి వంశీ వెనక్కి తగ్గలేదని కేశినేని నాని మాటలను బట్టి అర్థం అవుతోంది. వంశీతో మాట్లాడిన తర్వాత కేశినేని నాని మీడియాతో మాట్లాడారు. ‘వల్లభనేని వంశీతో చర్చించాం. ఇప్పుడు వంశీకి టీడీపీ అవసరం ఉంది. టీడీపీకి కూడా వంశీ అవసరం అంతే ఉంది. ఇద్దరికీ విన్ విన్ సిట్యుయేషన్. వంశీకి చెప్పాల్సింది చెప్పాం. బంతి ఆయన కోర్టులోనే ఉంది. తేల్చుకోవాల్సింది కూడా ఆయనే.’ అని అన్నారు.
2019 ఏప్రిల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గాలి వీచింది. ఆ పార్టీ తరఫున 151 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. జగన్ ప్రభంజనంలో కూడా గెలిచిన వంశీ లాంటి వాళ్లు ఇప్పుడు రాజకీయాల నుంచే తప్పుకుంటామని వెన్నుచూపడం సరికాదని కేశినేని నాని అన్నారు. వ్యాపారం, ఉద్యోగంలో అన్నిచోట్లా ఒత్తిళ్లు ఉన్నట్టే రాజకీయాల్లోనూ ఉంటాయని, వాటికి వెన్నుచూపి పారిపోవద్దని నాని సూచించారు. అయితే, నాని, నారాయణ చెప్పిన విషయాలను వంశీ లైట్ తీసుకున్నట్టు సమాచారం. నవంబర్ 3న వల్లభనేని వంశీ పార్టీ మారడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.
పాక్ రైల్లో అగ్నిప్రమాదం.. 65 మంది సజీవదహనం
Published by:
Ashok Kumar Bonepalli
First published:
October 31, 2019, 3:54 PM IST