‘హ్యాంగోవర్లో వల్లభనేని వంశీ’... లోకేష్ సంచలన వ్యాఖ్యలు

2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని వల్లభనేని వంశీ ఎన్ని తిట్లు తిట్టారో అందరికీ తెలుసన్నారు. వంశీ దానిపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

news18-telugu
Updated: November 17, 2019, 6:19 PM IST
‘హ్యాంగోవర్లో వల్లభనేని వంశీ’... లోకేష్ సంచలన వ్యాఖ్యలు
నారా లోకేష్, వల్లభనేని వంశీ
  • Share this:
వల్లభనేని వంశీ మీద నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంకా హ్యాంగోవర్లోనే ఉన్నారని అన్నారు. మీడియాతో మాట్లాడిన నారా లోకేష్ విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ.. ‘అది 2009 నాటి అంశం. ఆ తర్వాత 2014లో టీడీపీ గెలిచింది. ప్రస్తుతం మనం 2019లో ఉన్నాం. ఆయన ఇంకా హ్యాంగోవర్లో ఉన్నాడు.’ అని అన్నారు. టీడీపీని వీడాలనుకున్న వల్లభనేని వంశీ.. రాజీనామా చేస్తా.. చేస్తా అంటున్నారే కానీ, ఎందుకు చేయడం లేదని నారా లోకేష్ ప్రశ్నించారు. వంశీకి భయం ఉందని, అందుకే రాజీనామా చేయడం లేదని చెప్పారు. ఓసారి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే.. మళ్లీ గెలవలేమనే భయం ఉందని, అందుకే రాజీనామాకు వెనుకాడుతున్నారని లోకేష్ చెప్పారు. ‘వల్లభనేని వంశీ మొన్నేమో నా మీద ఒత్తిడి వస్తుంది. కార్యకర్తల మీద ఒత్తిడి వస్తుందన్నారు. ఇప్పుడేమో ప్లేట్ తిప్పేశారు. యూటర్న్ కాదు. జే టర్న్ తీసుకున్నారు. మొన్న ఒక మాట. నిన్న ఒక మాట మాట్లాడుతున్నారు. రేపు మరొకటి చెబుతారు.’ అని నారా లోకేష్ అన్నారు.

పార్టీ నుంచి ఒకరిద్దరు వెళ్లిపోయినా టీడీపీకి వచ్చే నష్టం లేదని లోకేష్ స్పష్టం చేశారు.నేతలు వెళ్లిపోయినా కార్యకర్తలు పోరాడుతున్నారని, పార్టీకి అండగా నిలబడ్డారని చెప్పారు. ఇలాంటి వారిని చాలా మందిని చూశామని లోకేష్ వ్యాఖ్యానించారు. ‘నేతలు వస్తుంటారు. పోతుంటారు. ఇలాంటి వాళ్లు వెళ్లిపోయినా నష్టం లేదు. ఇన్ని మాటలు మాట్లాడే వ్యక్తి ఓ కార్యకర్త చనిపోతే వచ్చారా? పట్టించుకున్నారా?’ అని లోకేష్ నిలదీశారు.

2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని వల్లభనేని వంశీ ఎన్ని తిట్లు తిట్టారో అందరికీ తెలుసన్నారు. వంశీ దానిపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ‘ఇన్ని మాటలు మాట్లాడే వ్యక్తికి కొంచెం సిగ్గున్నా రాజీనామా చేయాలి.’ అని లోకేష్ వ్యాఖ్యానించారు.

First published: November 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...