చంద్రబాబు పళ్లు కొరకడం తప్ప ఏమీ చేయలేరు : వల్లభనేని వంశీ తీవ్ర వ్యాఖ్యలు

Vallabhaneni Vamshi on Chandrababu Naidu : చంద్రబాబుకి రోషం ఉంటే పార్టీ మారిన రాజ్యసభ సభ్యులను సస్పెండ్ చేయాలన్నారు. జూ.ఎన్టీఆర్‌కి,నారా లోకేశ్‌కి నక్కకు నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందని ఎద్దేవా చేశారు.

news18-telugu
Updated: November 15, 2019, 3:31 PM IST
చంద్రబాబు పళ్లు కొరకడం తప్ప ఏమీ చేయలేరు : వల్లభనేని వంశీ తీవ్ర వ్యాఖ్యలు
వల్లభనేని వంశీ
  • Share this:
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ శుక్రవారం విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావును కలిశారు. సోషల్ మీడియాలో తనను కించపరిచేలా కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీపీకి ఫిర్యాదు చేశారు. ఆడపిల్లల పేర్లతో ఫోటోలు మార్ఫింగ్ చేసి అభ్యంతరకర రీతిలో పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఇదంతా టీడీపీ సోషల్ మీడియా వింగ్‌ చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు.బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని సీపీని కోరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు.

తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై స్పందిస్తూ.. 'చంద్రబాబు చేసేదేంటి.. నేనే పనిచేయనని చెప్పి బయటకొచ్చేశా' అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు అంత సీన్ లేదని.. పళ్లు కొరకడం తప్ప తననేమీ చేయలేరని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకి రోషం ఉంటే పార్టీ మారిన రాజ్యసభ సభ్యులను సస్పెండ్ చేయాలన్నారు. జూ.ఎన్టీఆర్‌కి,నారా లోకేశ్‌కి నక్కకు నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందని ఎద్దేవా చేశారు.లోకేశ్‌కి పనిలేక సోషల్ మీడియా వింగ్స్ నడుపుకుంటూ కూర్చుంటున్నాడని విమర్శించారు. వెబ్‌సైట్స్ ద్వారా నేతల మీద బురదజల్లే కార్యక్రమం చేస్తున్నారని.. తనపై కూడా అలా బురదజల్లినందువల్లే మనస్తాపంతో పార్టీని వీడానని చెప్పుకొచ్చారు. పరువు కాపాడుకునేందుకు తనను సస్పెండ్ చేశారని.. వారి హుంకరింపులకు, బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.

First published: November 15, 2019, 3:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading