ఒరేయ్ రాజేంద్ర.. చెత్త నా కొడకా.. : టీవీ లైవ్‌లోనే విరుచుకుపడ్డ వంశీ

Vallabhaneni Vamshi Vs Babu Rajendra Prasad : అక్కడ తనకు ఒక్క ఎకరా పొలం లేదని... ఏదో తన పొలానికి నీళ్లు ఇచ్చినట్టు చెబుతున్నారని మండిపడ్డారు. భూములు ఇచ్చిన రైతులకు నీళ్లు ఇవ్వకుండా డెల్టాకు తీసుకెళ్తారా అని ప్రశ్నించారు.

news18-telugu
Updated: November 15, 2019, 8:35 AM IST
ఒరేయ్ రాజేంద్ర.. చెత్త నా కొడకా.. : టీవీ లైవ్‌లోనే విరుచుకుపడ్డ వంశీ
వల్లభనేని వంశీ,బాబు రాజేంద్రప్రసాద్
  • Share this:
తెలుగుదేశం పార్టీని వీడి త్వరలోనే వైసీపీలో చేరేందుకు సిద్దమైన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టీవి9 లైవ్ డిబేట్‌లో ఈ ఇద్దరి మధ్య పెద్ద మాటల యుద్దమే జరిగింది. డిబేట్ సందర్భంగా పోలవరం కుడి కాలువ కోసం జరిగిన భూసేకరణ ప్రస్తావనకు వచ్చింది. 2004లో వైఎస్ హయాంలో పోలవరం కుడి కాలువ భూసేకరణకు రైతులు ఒప్పుకోలేదని.. టీడీపీ అధికారంలోకి వచ్చాక అక్కడి రైతులకు నచ్చజెప్పి తాను భూసేకరణ జరిపించానని వంశీ చెప్పారు. కాలువకు భూములు ఇచ్చినందుకు వారి పంట పొలాలకు నీళ్లు తీసుకొస్తామని హామీ ఇచ్చినట్టు చెప్పారు. చెప్పిన మాట ప్రకారం రైతులను ఆదుకునే ధర్మం ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు.అందుకే కాలువపై మోటార్లు బిగించామన్నారు. కానీ దేవినేని ఉమా అందుకు అడ్డుపడి డెల్టాకు నీళ్లు తీసుకెళ్తామన్నారని.. రైతులకు నీళ్లు ఇవ్వకుండా కింద ఉన్న డెల్టాకు నీళ్లు తీసుకెళ్లడంపై తాను అభ్యంతరం చెప్పానని అన్నారు.

ఇక్కడివరకు బాగానే జరిగిన డిబేట్ ఆ తర్వాత అనూహ్యంగా వ్యక్తిగత విమర్శలకు దారితీసింది. చంద్రబాబు నాయుడు వంశీని పార్టీలో స్పెషల్ ట్రీట్‌గా చేశారని.. అందుకే అప్పటి మంత్రి దేవినేని ఉమా అభ్యంతరం చెప్పినా.. ఆయన మాటను కాదని గన్నవరం రైతుల భూములకు కాలువ ద్వారా నీళ్లు ఇచ్చేందుకు ఒప్పుకున్నారని చెప్పారు. దీంతో రాజేంద్రప్రసాద్‌పై వంశీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మొదట రాజేంద్రన్నా అని మొదలుపెట్టిన ఆయన.. ఆ తర్వాత 'చెత్త నా కొడకా' అంటూ తిట్ల దండకం అందుకున్నారు. అక్కడ తనకు ఒక్క ఎకరా పొలం లేదని... ఏదో తన పొలానికి నీళ్లు ఇచ్చినట్టు చెబుతున్నారని మండిపడ్డారు. భూములు ఇచ్చిన రైతులకు నీళ్లు ఇవ్వకుండా డెల్టాకు తీసుకెళ్తారా అని ప్రశ్నించారు. అదేమైనా నీ తాత జాగీరా? అని విరుచుకుపడ్డారు.'నోరు మూయరా.. చెత్త నా కొడకా.. ఒంటి కన్నోడా.. డొక్క పగులుద్దిరా..' అంటూ తీవ్ర పదజాలం ఉపయోగించారు.

మధ్యలో బాబు రాజేంద్రప్రసాద్ కలగజేసుకుని.. కన్నతల్లి లాంటి పార్టీపై విమర్శలు చేస్తున్నారని మండిపడగా.. 'నోర్ముయ్.. ఏది పడితే అది మాట్లాడితే ముఖం పగిలిపోద్ది' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం తాము కూడా చాలా చేశామని చెప్పారు. నిజంగా నీకు పార్టీ కన్నతల్లి అయితే బోడె ప్రసాద్ దగ్గర డబ్బులు ఎందుకు తీసుకున్నావ్ అంటూ నిలదీశారు.రాజేంద్రప్రసాద్ ఒక జోకర్,ఒక బఫూన్ అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. వంశీ చేసిన తీవ్ర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయ్యప్ప మాలలో ఉండి కూడా వంశీ ఇలా సహనం కోల్పోవడమేంటని

కొంతమంది ప్రశ్నిస్తున్నారు.

First published: November 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...