టీడీపీ నుంచి వల్లభనేని వంశీ సస్పెన్షన్

టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై తీవ్రమైన విమర్శలు చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని టీడీపీ నిర్ణయించింది.

news18-telugu
Updated: November 15, 2019, 2:17 PM IST
టీడీపీ నుంచి వల్లభనేని వంశీ సస్పెన్షన్
వల్లభనేని వంశీ
  • Share this:
టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై తీవ్రమైన విమర్శలు చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని టీడీపీ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి మరికొద్దిసేపట్లో ఆదేశాలు జారీ కానున్నాయని తెలుస్తోంది. ఆయనకు షోకాజ్‌ నోటీసు ఇవ్వాలనే యోచన కూడా టీడీపీలో ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీ ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబుతో పాటు లోకేశ్‌పై వంశీ చేసిన విమర్శలను టీడీపీ నేతలు తీవ్రంగా తప్పుబట్టినట్టు సమాచారం. వంశీ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని టీడీపీ డిమాండ్ చేయనుందని తెలుస్తోంది. వంశీ పార్టీని వీడి వైసీపీలో చేరడం దాదాపు ఖాయం కావడంతో... గన్నవరం టీడీపీ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే దానిపై కూడా టీడీపీలో చర్చ జరిగింది.






First published: November 15, 2019, 2:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading