ఏపీ రాజకీయాల్లో కొత్త ట్రెండ్... అతడితోనే మొదలు...

వల్లభనేని వంశీ విషయంలో టీడీపీ ఎలా వ్యవహరిస్తుంది ? ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా ? ఒకవేళ ఆయన రాజీనామా చేస్తే దానిని స్పీకర్ ఆమోదిస్తారా ? వంటి ప్రశ్నలు అందరి మదిలోనూ మెదులుతున్నాయి.

news18-telugu
Updated: November 15, 2019, 7:33 PM IST
ఏపీ రాజకీయాల్లో కొత్త ట్రెండ్... అతడితోనే మొదలు...
వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్, చంద్రబాబునాయుడు
  • Share this:
ఏపీ రాజకీయాల్లో కొత్త ట్రెండ్ మొదలుకాబోతోందా ? ఎన్నికల్లో ఒక పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు మరో పార్టీలో చేరినా... స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడం గతంలో జరిగింది. అయితే తమ హయాంలో అలా జరగదని ఏపీ సీఎం జగన్ చాలాసార్లు క్లారిటీ ఇచ్చారు. అయితే ఆయన మాటలు ఎలా ఉన్నా... వాస్తవం ఎలా ఉంటుందనే అంశం తేలాల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నికల తరువాత ఇప్పటివరకు ఎవరూ పార్టీ మారకపోవడంతో... ఈ అంశంపై చర్చ జరిగిన సందర్భం లేదు. అయితే తాజాగా వల్లభనేని వంశీ వైసీపీలో చేరతానని ప్రకటించడంతో... దీనిపై చర్చ మొదలైంది.

వల్లభనేని వంశీ విషయంలో టీడీపీ ఎలా వ్యవహరిస్తుంది ? ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా ? ఒకవేళ ఆయన రాజీనామా చేస్తే దానిని స్పీకర్ ఆమోదిస్తారా ? వంటి ప్రశ్నలు అందరి మదిలోనూ మెదులుతున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే వల్లభనేని వంశీ వ్యవహారం ఏపీలో మరో నయా ట్రెండ్‌కు శ్రీకారం చుట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలు వస్తే... వంశీ తరువాత టీడీపీకి రాజీనామా చేస్తారని భావిస్తున్న మిగతా వాళ్లు కూడా ఉప ఎన్నికలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వాళ్లు వైసీపీలో చేరినా... బీజేపీ కండువా కప్పుకున్నా.. ఉప ఎన్నికలు అనివార్యమవుతాయి.

అయితే టీడీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన వంశీ వైసీపీలో చేరకుండా తటస్థంగా ఉండిపోతారని... కాబట్టి ఆయన శాసనసభ సభ్యత్వానికి వచ్చిన ముప్పేమీ ఉండదనే ఊహాగానాలు కొద్దిరోజులుగా వినిపిస్తున్నాయి. ఒకవేళ వంశీ అలా వ్యవహరించి ఎమ్మెల్యే పదవి కోల్పోకుండా ఉంటే... టీడీపీని వీడాలని భావించే మిగతా ఎమ్మెల్యేలు కూడా ఇదే రకంగా వ్యవహరించే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి వల్లభనేని వంశీ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

First published: November 15, 2019, 7:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading