ఏపీ సెక్రటేరియట్‌కి వాస్తు దోషం... జగన్ సీఎం అయినా కూడా...

వెలగపూడి సచివాయంలో ఈశాన్య ద్వారం మినహాయిస్తే... మిగతా అన్ని స్ధానాల్లోనూ వాస్తు దోషాలు ఉన్నాయన్నారు వాస్తు సిద్ధాంతి.

news18-telugu
Updated: May 20, 2019, 1:37 PM IST
ఏపీ సెక్రటేరియట్‌కి వాస్తు దోషం... జగన్ సీఎం అయినా కూడా...
అమరావతి డిజైన్లు
news18-telugu
Updated: May 20, 2019, 1:37 PM IST
ఏపీ ఎగ్జిట్ పోల్స్ తర్వాత కొందరు జ్యోతిష్యులు చంద్రబాబు గెలుపోటములపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. లగడపాటి సర్వే టీడీపీకి అనుకూలంగా వచ్చినా... సిద్ధాంతులు మాత్రం చంద్రబాబు సీఎం కాలేరంటూ జోస్యం చెబుతున్నారు. అయితే దీనికి ఇప్పుడువాళ్లు చెబుతున్న కారణాలు ఎంతో ఆసక్తికరంగా మారాయి. తాజాగా అమరావతి సచివాలయాన్ని తెరపైకి తీసుకొచ్చారు వాస్తు సిద్ధాంతి గోటూరి పామలు. అమరావతిలోని ఏపీ సచివాలయంలో వాస్తు దోషాల కారణంగా ముఖ్యమంత్రి స్ధానంలో ఉన్న చంద్రబాబునాయుడు అన్ని విషయాల్లోనూ వెనుకబడి ఉంటున్నారన్నారు. విజయవాడకు చెందిన వాస్తు సిద్ధాంతి గోటూరి సచివాలయ వాస్తును విశ్లేషించారు. వెలగపూడి సచివాయంలో ఈశాన్య ద్వారం మినహాయిస్తే... మిగతా అన్ని స్ధానాల్లోనూ వాస్తు దోషాలు ఉన్నాయన్నారు. వీటిపై తనను ఎవరూ సంప్రదించకపోవడంతో తాను ఈ వివరాలు ఇప్పటివరకూ వెల్లడించలేదన్నారు. ఎన్నికల సమయం కావడంతో తనకు తానుగా ముందుకొచ్చి ఈ లోపాలపై బహిరంగంగా మాట్లాడుతున్నానని వాస్తు సిద్ధాంతి చెప్పుకొచ్చారు.

అమరావతిలో సెక్రటేరియట్‌ను రూట్ ఎండ్ కి కట్టారన్నారు. తప్పుడు నిర్ణయాలకు సీఎం బలి కానున్నారంటూ సిద్ధాంతి తెలిపారు.ముఖ్యమంత్రి కార్యాలయం ముందు అసెంబ్లీ నిర్మించడంతో తూర్పువైపు మూత పడి పోయిందన్నారు. దీని వలన నష్టం జరుగుతుందని జోస్యం చెప్పారాయన.ఒక్క ఈశాన్య గేట్ తప్ప...మొత్తం సెక్రటేరియట్ వాస్తు సరిగా లేదన్నారు. నిప్పు ఎలాంటి వారు పట్టుకున్న కాలడం ఖాయమన్న ఆయన... అలానే తప్పుల ఎవరు చేసిన బాధ్యులు సీఎంయే అవుతారన్నారు. చంద్రబాబు కాదు... జగన్‌ సీఎం అయినా కూడా..ఇలా ఏ ముఖ్యమంత్రి సెక్రటేరియట్‌కి కి వెళ్లిన డౌన్ అయిపోతారన్నారు. ముక్కోణం రోడ్... రోడ్ శుల.. సెక్రటేరియట్ వాస్తు ఖచ్చితంగా మార్చాల్సి ఉందన్నారు సిద్ధాంతి గోటూరి.First published: May 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...