కాంగ్రెస్‌లో కోవర్టులు... కోట్లు తీసుకున్నారు... వీహెచ్ సంచలన వ్యాఖ్యలు

ఎన్నికల సమయంలోనే కొందరు నేతలు గాంధీ భవన్ చుట్టూ తిరుగుతారని... పదవులు వచ్చాక గాంధీ భవన్ వైపే చూడటం లేదని వీహెచ్ విమర్శించారు.

news18-telugu
Updated: May 5, 2020, 7:26 PM IST
కాంగ్రెస్‌లో కోవర్టులు... కోట్లు తీసుకున్నారు... వీహెచ్ సంచలన వ్యాఖ్యలు
వి హనుమంతరావు(ఫైల్ ఫోటో..)
  • Share this:
గాంధీభవన్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వికారాబాద్‌లో మాజీమంత్రి చంద్రశేఖర్ దగ్గర ఎన్నికల సమయంలో కొందరు నేతలు కోట్లు తీసుకున్నారని వీహెచ్ ఆరోపించారు. ఇది పార్టీకి మంచిది కాదని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలోనే కొందరు నేతలు గాంధీ భవన్ చుట్టూ తిరుగుతారని... పదవులు వచ్చాక గాంధీ భవన్ వైపే చూడటం లేదని విమర్శించారు. ఇప్పటికీ పార్టీ కాంగ్రెస్ పార్టీలో కొందరు కోవర్టులు ఉన్నారన్న వీహెచ్... వారంతా తెలంగాణలో కేసీఆర్, ఏపీలో వైఎస్ జగన్ అధికారంలో ఉండాలని కోరుకుంటున్నారని ఆరోపించారు. అలాంటి కోవర్టులతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Published by: Kishore Akkaladevi
First published: May 5, 2020, 7:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading