కేసీఆర్ నియోజకవర్గంలో రైతు కుటుంబానికి వీహెచ్ సాయం...

నర్సింహులు కుటుంబానికి సాయం చేస్తున్న వి.హనుమంతరావు

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో రైతుకు కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు సాయం చేశారు.

  • Share this:
    ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో రైతుకు కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు సాయం చేశారు. వర్గల్ మండలం, వేలూరు గ్రామానికి చెందిన బ్యాగారి నర్సింహులు కు చెందిన 13 గుంటల భూమి ఉంది. దాన్ని లాక్కొని అందులో రైతు వేదికను నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్నారంటూ నర్సింహులు ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంత రావు నర్సింహులు కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు పేద దళితులకు చెందిన భూమిని ఇలా లాక్కోవడం బాధాకరమైన విషయమని అన్నారు. ఈ సంఘటనకు కారకులైన వారిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అలాగే నర్సింహులు కుటుంబానికి 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వీహెచ్... నర్సింహులు కుటుంబానికి తన వంతుగా రూ.10,000 ఆర్థిక సహాయాన్ని అందచేశారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: