HOME »NEWS »POLITICS »v hanumantha rao fires on telangana congress leaders slams kvp ramachandra rao ak

వైఎస్ ‘ఆత్మ’కు ఇక్కడ ఏం పని ?... కిరణ్ బేడీని గవర్నర్‌గా నియమించాలన్న వీహెచ్

వైఎస్ ‘ఆత్మ’కు ఇక్కడ ఏం పని ?... కిరణ్ బేడీని గవర్నర్‌గా నియమించాలన్న వీహెచ్
వి హనుమంతరావు(ఫైల్ ఫోటో..)

భట్టి విక్రమార్క కేవీపీ శిష్యుడా లేక వీహెచ్ శిష్యుడా అన్నది ఆయనే చెప్పాలని వీహెచ్ అన్నారు. కొంతకాలంగా రాహుల్ గాంధీ ఎవరికి అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని... రాష్ట్ర నేతలు మాత్రం దీక్ష విరమింపజేసీ రాహుల్ గాంధీ పేరు చెప్పారని వీహెచ్ అన్నారు.

  • Share this:
    తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మరోసారి రాష్ట్ర నేతలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్‌గా మాట్లాడిన వీహెచ్... పార్టీ నేతల తీరును తప్పుబట్టారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే నేతలు దీక్ష చేపట్టారని ఆరోపించారు. భట్టి విక్రమార్కను ఏపీ కాంగ్రెస్ నేత, ఎంపీ కేవీపీ రామచంద్రరావు పరామర్శించడంపై వీహెచ్ సెటైర్లు వేశారు. వైఎస్ ఆత్మకు తెలంగాణలో ఏం పని అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం కూడా తెలంగాణలో పార్టీ వ్యవహారాలను పట్టించుకోవడం లేదని అన్నారు.

    భట్టి విక్రమార్క కేవీపీ శిష్యుడా లేక వీహెచ్ శిష్యుడా అన్నది ఆయనే చెప్పాలని వీహెచ్ అన్నారు. కొంతకాలంగా రాహుల్ గాంధీ ఎవరికి అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని... రాష్ట్ర నేతలు మాత్రం దీక్ష విరమింపజేసీ రాహుల్ గాంధీ పేరు చెప్పారని వీహెచ్ అన్నారు. తెలంగాణకు కొత్త గవర్నర్‌ను నియమించాలని కోరిన వీహెచ్... కిరణ్ బేడీని తెలంగాణకు గవర్నర్‌గా నియమిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

    Published by:Kishore Akkaladevi
    First published:June 11, 2019, 14:41 IST