వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెడుతున్నారంటూ కథనాలు.. సంచలన వ్యాఖ్యలు చేసిన వీహెచ్

వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెడుతున్నారంటూ కథనాలు.. సంచలన వ్యాఖ్యలు చేసిన వీహెచ్

YS Sharmila - V Hanumantha Rao: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ ప్రచారం జరగుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ టాపిక్ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ ప్రచారం జరగుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ టాపిక్ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలు కూడా ఈ అంశంపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాలు చేయనున్నట్టుగా వస్తున్న వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ వి హనుమంతరావు స్పందించారు. ఓ ప్రముఖ దినపత్రికలో ప్రచురితమైన కథనంపై వీహెచ్ స్పందించారు. షర్మిలకు విశాఖ ఎంపీ టికెట్ ఇవ్వకుండా జగన్ అన్యాయం చేశారని ఆరోపించారు. షర్మిల పార్టీ పెట్టాలని భావిస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టడం మేలని ఆయన వ్యాఖ్యనించారు. తెలంగాణలో పార్టీ పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని జోస్యం చెప్పారు. జగన్‌పై ప్రతీకారం తీర్చుకోవాంటే షర్మిల ఏపీలో పార్టీ పెట్టాలని సూచించారు. వైఎస్ రాజశేఖరరెడ్డికి తానొక్కడినే వారసుడిగా జగన్ భావిస్తున్నారని వీహెచ్ అభిప్రాయపడ్డారు. షర్మిలలో కూడా ప్రవహిస్తున్నది వైఎస్ రక్తమేనని.. అందుకే ఆమె పార్టీ పెట్టే ఆలోచన చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

  ప్రతి ఏడాది వైఎస్ జగన్ కుటుంబమంతా పులివెందులలో జరిగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటూ వచ్చేది. ఈసారి కూడా ఇక్కడ జరిగే వేడుకల్లో వైఎస్ ఫ్యామిలీ పాల్గొంది. సీఎం జగన్, ఆయన భార్య భారతి, తల్లి విజయమ్మ సహా పలువురు సన్నిహితులు ఈ వేడుకలో పాల్గొన్నారు. అయితే ఇందుల్లో షర్మిల, ఆమె భర్త అనిల్ మాత్రం కనిపించలేదు. దీంతో వైఎస్ జగన్, షర్మిల మధ్య గ్యాప్ వచ్చిందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఎన్నికల్లో తనకు తోడుగా నిలిచిన షర్మిలకు ఇచ్చిన హామీని నేరవేర్చడంలో వైఎస్ జగన్ విఫలమయ్యారని.. ఈ నేపథ్యంలో వారి మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయని వార్తలు వెలువడుతున్నాయి. దీంతో షర్మిల తెలంగాణలో సొంత పార్టీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారని ప్రచారం జరగుతోంది.

  అయితే ఈ వార్తలపై షర్మిల నుంచి గానీ, వైసీపీ నాయకుల నుంచి గానీ ఎలాంటి స్పందిన లేకపోవడం గమనార్హం. షర్మిల పార్టీ పెట్టబోతున్నారనే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న వైసీపీ నేతలు కూడా వాటిని ఖండించకపోవడంతో కొందరు ఈ వార్తలు నిజమేనని నమ్ముతున్నారు. అయితే ఈ వార్తల నిజనిజాలు తెలియాలంటే షర్మిల వైపు నుంచి ఒక స్పష్టమైన ప్రకటన వెలువడాల్సి ఉంది.
  Published by:Sumanth Kanukula
  First published: